logo

కార్డుదారుల నుంచి బియ్యం కొంటే కేసులు

రేషన్‌ కార్డుదారుల నుంచి బియ్యం కొంటే కేసులు నమోదు చేస్తామని, రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని, లైసెన్స్‌లు రద్దు చేస్తామని సంయుక్త కలెక్టర్‌(రెవెన్యూ) సుమిత్‌కుమార్‌ హెచ్చరించారు. ఈ నెల 17న ‘ఎవరికి వారు.. మారని తీరు’.., 20న ‘బియ్యమా.. నగదా..?

Published : 21 Jan 2022 06:37 IST

● ‘ఈనాడు’ వరుస కథనాలకు స్పందన

కాకినాడ కలెక్టరేట్‌: రేషన్‌ కార్డుదారుల నుంచి బియ్యం కొంటే కేసులు నమోదు చేస్తామని, రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని, లైసెన్స్‌లు రద్దు చేస్తామని సంయుక్త కలెక్టర్‌(రెవెన్యూ) సుమిత్‌కుమార్‌ హెచ్చరించారు. ఈ నెల 17న ‘ఎవరికి వారు.. మారని తీరు’.., 20న ‘బియ్యమా.. నగదా..?... శీర్షికలతో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాలపై ఆయన స్పందించారు. రేషన్‌ బియ్యాన్ని ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేసే ఎండీయూ ఆపరేటర్లు, చౌక డీలర్లు కొనుగోలు చేస్తున్నారని, బియ్యానికి బదులు నగదు పంపిణీ చేస్తున్నారని వచ్చిన కథనాలపై కదలిక వచ్చింది. గురువారం కలెక్టరేట్‌ కోర్టు మందిరంలో ఏఎస్‌వో, ఎంఎస్‌వోలతో ఆయన సమీక్ష నిర్వహించారు. కార్డుదారుల దగ్గర బియ్యం కొన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్మితే.. అది రుజువైతే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ బియ్యాన్ని రైస్‌ మిల్లర్లు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు చేపడతామన్నారు. డీఎస్‌వో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని