logo

పులొచ్ఛె. జర భద్రం

అటవీ ఉత్పత్తులపై ఆధారపడి ప్రశాంతంగా జీవించే మన్యంలోని వీఆర్‌పురం మండల వాసులకు.. పులి తిరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అడవిలోకి ఎవరూ వెళ్లవద్దంటూ స్థానిక రేంజర్‌ శ్రీనివాసరెడ్డి చేసిన హెచ్చరికలు కంటికి కునుకులేకుండా

Published : 22 Jan 2022 05:23 IST


పులి అడుగు జాడ

 

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: అటవీ ఉత్పత్తులపై ఆధారపడి ప్రశాంతంగా జీవించే మన్యంలోని వీఆర్‌పురం మండల వాసులకు.. పులి తిరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అడవిలోకి ఎవరూ వెళ్లవద్దంటూ స్థానిక రేంజర్‌ శ్రీనివాసరెడ్డి చేసిన హెచ్చరికలు కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. శుక్రవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇక్కడి చిన్నమట్టపల్లి గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ గిరిజనుడికి పులి కనిపించిందనే సమాచారం అందింది. దాంతో అటవీశాఖ సిబ్బంది బృందంగా వెళ్లి పరిశీలించగా పులి అడుగుజాడలను గమనించారు. స్థానికంగా సామాజిక మాధ్యమంలో పెట్టిన ఫొటోలు మాత్రం ఇక్కడివి కావన్నారు. సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులను అడవిలోకి మేతకు తీసుకువెళ్లవద్దని సూచిస్తున్నామని రేంజర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని