logo

జిల్లాకు 25 వేల ఎంసీపీ కార్డులు

జిల్లాకు 25 వేల మాతాశిశు సంరక్షణ(ఎంసీపీ) కార్డులు వచ్చాయని అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.మీనాక్షి తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అందించే ఈ పుస్తకాలు 99,000 రావాల్సి ఉండగా, మొదటి విడతలో 25 వేలు శుక్ర

Published : 22 Jan 2022 05:23 IST


డీఎంహెచ్‌వో కార్యాలయానికి చేరుకున్న మదర్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌(ఎంసీపీ) కార్డులు

మసీదుసెంటర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: జిల్లాకు 25 వేల మాతాశిశు సంరక్షణ(ఎంసీపీ) కార్డులు వచ్చాయని అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.మీనాక్షి తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అందించే ఈ పుస్తకాలు 99,000 రావాల్సి ఉండగా, మొదటి విడతలో 25 వేలు శుక్రవారం కార్యాలయానికి చేరుకున్నాయన్నారు. వాటిపై క్యూఆర్‌ కోడ్‌లు అతికించి ఇచ్చేలా ఏర్పాట్లు చేశారన్నారు. పీహెచ్‌సీలకు వీటిని పంపుతామని చెప్పారు. తల్లులు, పిల్లల శారీరక, మానసిక, సాంఘిక అభివృద్ధి దశలను గుర్తించేందుకు ఈ కార్డులు ఉపయోగపడతాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని