logo

సాగునీటి విడుదల పర్యవేక్షణకు కమిటీలు

రబీలోకాలువల ద్వారా సాగునీటి విడుదలకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఈనెల 25 నుంచి వారాబందీ అమలు నేపథ్యంలో కాలువలు, మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తూ జేసీ సుమిత్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు

Published : 22 Jan 2022 05:23 IST

కాకినాడ కలెక్టరేట్‌: రబీలోకాలువల ద్వారా సాగునీటి విడుదలకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఈనెల 25 నుంచి వారాబందీ అమలు నేపథ్యంలో కాలువలు, మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తూ జేసీ సుమిత్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 1,045 కాలువల పరిధిలో వాటర్‌ రిలీజ్‌ మానిటరింగ్‌ కమిటీలు వేశారు. వీటిలో గ్రామ వ్యవసాయ సలహా మండలి ఛైర్‌పర్సన్‌, వీఆర్వో, గ్రామ వ్యవసాయ/ఉద్యాన సహాయకుడు, లస్కర్‌ను సభ్యులుగా నియమించారు. 40 మండలాల్లోఈ కమిటీలను వేశారు. దీనిలో మండల వ్యవసాయ సలహా మండలి ఛైర్‌పర్సన్‌, తహసీల్దారు, మండల వ్యవసాయ అధికారి, ఇరిగేషన్‌ ఏఈ, సూపరింటెండెంట్‌(లాక్‌)ను సభ్యులుగా నియమించారు. వీరంతా కాలువకు నిర్దేశిత సమయం ప్రకారం సాగునీటి విడుదలను పర్యవేక్షించనున్నారు. ఏ కాలువకు ఏ రోజు నీటిని విడుదల చేయాలి, ఏ రోజు నిలిపివేయాలో నిర్ణయిస్తారు. ఏప్రిల్‌ ఆఖరు వరకు ఈ కమిటీలు పనిచేస్తాయి.నీటి ఎద్దడి ఎదురైతే 18004253077 టోల్‌ఫ్రీ నంబరుకు చెప్పవచ్ఛుఈనెల 25 లోపు అన్ని రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని జేసీ సుమిత్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని