logo

ఏమైనా కాణీ... కట్టించాల్సిందే!

ఓటీఎస్‌ లక్ష్యాలు చేరుకోలేదని తుని పట్టణంలో 12 మంది సచివాలయ సిబ్బందికి నియోజకవర్గ ప్రత్యేక అధికారి మెమో జారీచేశారు. పట్టణ పరిధిలో కొండవారిపేట, సీతారాంపురం, అమ్మాజీపేట, శాంతి నగర్‌, గుర్రాలశాల తోట, గవరపేట, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం, ఇసుకల పేట, రామకృష్ణాకా

Published : 22 Jan 2022 05:23 IST

ఈనాడు, కాకినాడ - న్యూస్‌టుడే, తుని పట్టణం : ఓటీఎస్‌ లక్ష్యాలు చేరుకోలేదని తుని పట్టణంలో 12 మంది సచివాలయ సిబ్బందికి నియోజకవర్గ ప్రత్యేక అధికారి మెమో జారీచేశారు. పట్టణ పరిధిలో కొండవారిపేట, సీతారాంపురం, అమ్మాజీపేట, శాంతి నగర్‌, గుర్రాలశాల తోట, గవరపేట, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం, ఇసుకల పేట, రామకృష్ణాకాలనీ, వీరవరపుపేట, బ్యాంకు కాలనీ, ఎం.ఆర్‌.పేట సచివాలయాల పరిధిలోని వార్డు అడ్మిన్‌ కార్యదర్శులకు ఈ మెమోలు ఇచ్చారు. ఈనెల 19 నాటికి లక్ష్యం చేరనందునమీపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆయా లేఖల్లో పేర్కొన్నారు

 

పెద్దాపురం పట్టణంలో 11 మంది, గ్రామీణంలో 13 మందికి.. సామర్లకోట పట్టణంలో 15 మందికి అధికారులు మెమోలు జారీచేశారు.

అమలాపురంలో లక్ష్య సాధనలో వెనకబడిన వారిని సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి పిలిపించి క్లాసు తీసుకున్నారు. ప్రజలు సహకరించకపోతే మేమేం చేయాలంటూ పలువురు వాపోయినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌ గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణాలు పొంది ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు వాటిపై పూర్తిహక్కులు కల్పిస్తూ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తోంది. ఇదే... జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం. జిల్లాలో రుణాలు పొందిన, రుణాలు పొందకుండా ప్రభుత్వం ఇచ్చిన భూమిలో సొంతంగా ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులు 5,24,100 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రుణాలు పొందినవారు గ్రామీణంలో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, నగర పాలక సంస్థల్లో రూ.20 వేలు చొప్పున చెల్లించి శాశ్వత హక్కు పొందే అవకాశం కల్పించారు. సొంతంగా కట్టుకున్న వాళ్లకు కేవలం రూ.10కే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు.

ఆపసోపాలు...

డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్లకు పలుచోట్ల ప్రజలు ముందుకురాని పరిస్థితి. ● అధికారుల ఒత్తిళ్లకు బెదిరి సచివాలయ సిబ్బంది లబ్ధిదారులను పదేపదే నగదు చెల్లించమని కోరడంతో కొన్నిచోట్ల ప్రతిఘటనలూ ఎదురవుతున్నాయి. ● మండలం/గ్రామం/పట్టణం/డివిజన్‌ వారీగా ఓటీఎస్‌ లక్ష్యాలునిర్దేశించారు. ● ఆయా ప్రత్యేక అధికారులు వీటి సాధనకు కిందిస్థాయి సిబ్బందితో నయానో భయానో లక్ష్యాలు పూర్తిచేయించాల్సి వస్తోంది. ● కొందరు ఒకేసారి సొమ్ము చెల్లించలేమని చెబుతుంటే.. కనీసం రెండు వాయిదాల్లోనైనా చెల్లించండని ఒప్పిస్తున్నారు.

ఎవరి మీద ఒత్తిళ్లు లేవు..: స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారితో కట్టించుకుని రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నాం. లబ్ధిదారులపైనగానీ, సిబ్బందిపైన గానీ ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఉగాది వరకు ఓటీఎస్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. - బి.సుదర్శన్‌ పట్నాయక్‌, పీడీ, ఏపీ గృహనిర్మాణ సంస్థ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని