logo

అది బొమ్మ తుపాకీ..

ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలోని మరిడమ్మ జాతరలో యువకులు తుపాకీతో నృత్యం చేశారంటూ వీడియోలు వైరల్‌కాగా, పోలీసులు విచారణలో అది బొమ్మ తుపాకీ అని తేలిందని అమలాపురంలో ఇన్‌ఛార్జి డీఎస్పీ రాంబాబు శుక్రవారం తెలిపా

Published : 22 Jan 2022 05:23 IST


వివరాలు వెల్లడిస్తున్న ఇన్‌ఛార్జి డీఎస్పీ రాంబాబు

 

అమలాపురం పట్టణం: ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలోని మరిడమ్మ జాతరలో యువకులు తుపాకీతో నృత్యం చేశారంటూ వీడియోలు వైరల్‌కాగా, పోలీసులు విచారణలో అది బొమ్మ తుపాకీ అని తేలిందని అమలాపురంలో ఇన్‌ఛార్జి డీఎస్పీ రాంబాబు శుక్రవారం తెలిపారు. చల్లపల్లికి చెందిన పోలిశెట్టి శివగంగాధర్‌ ఏడాది క్రితం కాకినాడలో రూ.1,500తో బొమ్మ తుపాకీ కొని, ఇంట్లో అలంకరణగా పెట్టుకున్నారు. వరుసకు అన్న కొడుకైన నరసింహమూర్తితో కలిసి ఆయన మరిడమ్మ జాతరలో బొమ్మ తుపాకీ పైకెత్తి డ్యాన్స్‌ చేశారు. ఆ దృశ్యాలు బాగా వైరల్‌ అవ్వడంతో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు విచారణ చేశారన్నారు. రూరల్‌ సీఐ సురేష్‌బాబు, ఎస్సై వెంకటేశ్వరరావు విచారించి, దానిని స్వాధీనం చేసుకున్నారు. శివగంగాధర్‌, నరసింహమూర్తిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని