logo

తల్లి, సోదరి బెయిల్‌ పిటీషన్‌ తిరస్కరణ

పాత పాల్వంచకు చెందిన మండిగ నాగరామకృష్ణ తల్లి, సోదరి తరఫున దాఖలైన బెయిల్‌ పిటీషన్‌ను శుక్రవారం కొత్తగూడెం అయిదో అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి మహ్మద్‌ అబ్దుల్‌ రఫీ తిరస్కరించారు. ఈ నెల 3న నాగరామకృష్ణ తన ఇద్ద

Published : 22 Jan 2022 05:23 IST

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో..

పాల్వంచ పట్టణం: పాత పాల్వంచకు చెందిన మండిగ నాగరామకృష్ణ తల్లి, సోదరి తరఫున దాఖలైన బెయిల్‌ పిటీషన్‌ను శుక్రవారం కొత్తగూడెం అయిదో అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి మహ్మద్‌ అబ్దుల్‌ రఫీ తిరస్కరించారు. ఈ నెల 3న నాగరామకృష్ణ తన ఇద్దరు కుమార్తెలు సాహిత్య, సాహితి, భార్య శ్రీలక్ష్మికి నిప్పంటించి తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో బాధితుణ్ని బెదిరించినందుకు గాను ఏ2గా కేసు నమోదైన వనమా రాఘవను, ఏ3, ఏ4 నిందితులుగా ఉన్న తల్లి సూర్యవతి, సోదరి లోవా మాధవి(రాజమహేంద్రవరం)లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. నాగరామకృష్ణ తల్లి, సోదరి తరఫున ఇటీవల పాల్వంచకు చెందిన న్యాయవాది గాజుల రామ్మూర్తి బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం వాదోపవాదాలు జరిగాయి. నిందితులు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడే అవకాశాలున్నాయని అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోసాని రాధాకృష్ణమూర్తి వాదన వినిపించారు. అనంతరం న్యాయమూర్తి పిటీషనర్‌ల అభ్యర్థనను తోసిపుచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని