logo

‘ప్రభుత్వ వైఖరిపై ఉద్యమం తప్పదు’

 పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ఉద్యమిస్తామని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగులు ఐక్య కార్యాచరణ సమితి(ఏపీ ఐకాస) జిల్లా శాఖ ప్రకటించింది. శనివారం కాకినాడ ఏపీఎన్జీవో భవన్‌లో ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్‌ జి.రామ్మోహనరా

Published : 23 Jan 2022 02:59 IST

మాట్లాడుతున్న ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్‌ రామ్మోహనరావు, వేదికపై వివిధ సంఘాల ప్రతినిధులు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ఉద్యమిస్తామని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగులు ఐక్య కార్యాచరణ సమితి(ఏపీ ఐకాస) జిల్లా శాఖ ప్రకటించింది. శనివారం కాకినాడ ఏపీఎన్జీవో భవన్‌లో ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్‌ జి.రామ్మోహనరావు అధ్యక్షతన జిల్లా శాఖలో భాగస్వాములైన వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పీఆర్సీలో ఇచ్చిన జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విశ్రాంత ఉద్యోగులకు అదనపు క్వాంటమ్‌ అమలు చేయాలని, ఒప్పంద, పొరుగుసేవల, కంటింజెంట్‌ వర్కర్లను క్రమబద్ధీకరించాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రస్థాయిలో ఐకాసలు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆదివారం స్థానిక ఏపీఎన్జీవో భవన్‌లో ఉదయం 10 గంటలకు పీఆర్సీ సాధన సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఏపీ ఐకాస జిల్లా కన్వీనర్‌ డీవీ రాఘవులు, ఏపీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా కార్యదర్శి పసుపులేటి శ్రీనివాస్‌, పాలపర్తి మూర్తిబాబు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్‌, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్నాథం, ట్రెజరీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పాము శ్రీనివాసరావు, జడ్పీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమేశ్‌, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ జార్జిరాజు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు రవిచక్రవర్తి, సుబ్బరాజు, ప్రదీప్‌కుమార్‌, లంక జార్జి, వై.వెంకట్రాజు, ఎన్‌వీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నల్లబ్యాడ్జీలతో విధులకు..

పీఆర్సీ సాధన సమితికి మద్దతుగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం నుంచి నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకానున్నట్లు విలేజ్‌ వార్డు సెక్రటరీయేట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాజేశ్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అనుబంధంగా ఉన్న తమ సంఘంలో సచివాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై, భోజన విరామ సమయంలో నిరసన తెలపాలని పిలుపు నిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని