logo

50కి పైగా చోరీలు.. 30 కేసుల్లో జైలు

ఒకటి.. రెండు కాదు.. 50కి పైగా చోరీ కేసుల్లో ప్రధాన నిందితుడు. జిల్లాతో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల నేరస్థులతో సంబంధాలు కలిగి ఆ ప్రాంతాల్లోని చోరీలకు పాల్పడ్డాడు. 30పైనే చోరీ కేసుల్లో శిక్ష పడి జైలు జీవితం అనుభవించాడు. 1979లో

Updated : 23 Jan 2022 06:33 IST


స్వాధీనం చేసుకున్న వెండి వస్తువులతో డీఎస్పీ సంతోష్‌ తదితరులు

రాజమహేంద్రవరం నేరవార్తలు: ఒకటి.. రెండు కాదు.. 50కి పైగా చోరీ కేసుల్లో ప్రధాన నిందితుడు. జిల్లాతో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల నేరస్థులతో సంబంధాలు కలిగి ఆ ప్రాంతాల్లోని చోరీలకు పాల్పడ్డాడు. 30పైనే చోరీ కేసుల్లో శిక్ష పడి జైలు జీవితం అనుభవించాడు. 1979లో ప్రారంభించిన చోరీలు... ఆరు పదుల వయసు దాటుతున్నా మార్పురాలే. ఇటీవల రాజమహేంద్రవరంలోని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని తాళం వేసిన ఓ వ్యాపారి ఇంట్లో భారీ మొత్తంలో వెండి వస్తువులు చోరీ చేసిన నిందితుడు శ్రీనివాసరావు పోలీసులకు పట్టుపడ్డాడు. ఇందుకు సంబంధించి డీఎస్పీ సంతోష్‌ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని నర్సిపల్లి వారి వీధిలో గౌతమ్‌ బుద్ధభగవాన్‌ అనే వ్యాపారి ఉంటున్నారు. సంక్రాంతి నేపథ్యంలో ఈ నెల 7న ఇంటికి తాళం వేసి కుటుంబమంతా ఊరెళ్లారు. తిరిగి 17న వచ్చి చూసేసరికి తాళం తెరిచి ఉంది. బీరువాల్లో రూ.నాలుగు లక్షల విలువ చేసే ఏడు కేజీల వెండి వస్తువులు చోరీకి గురయ్యాయని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... ఇది నగరంలోని అన్నపూర్ణమ్మపేట ప్రాంతానికి చెందిన గొల్లగాని శ్రీనివాసరావు అనే పాత నేరస్థుడని పనే అని గుర్తించారు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గుడ శ్రీకృష్ణనగర్‌ ప్రాంతంలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసి, 7.181 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని