logo

రూ.350కే కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష

ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష (ఆర్‌టీపీసీఆర్‌) రూ.350కే చేయాలని, అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని జేసీ (అభివృద్ధి) కీర్తి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్‌లో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు, వైద్య,

Published : 23 Jan 2022 02:59 IST


అధికారులు, ల్యాబ్‌ల ప్రతినిధులతో మాట్లాడుతున్న జేసీ కీర్తి

కాకినాడ కలెక్టరేట్‌: ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష (ఆర్‌టీపీసీఆర్‌) రూ.350కే చేయాలని, అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని జేసీ (అభివృద్ధి) కీర్తి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్‌లో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకన్నా ఎక్కువ వసూలు చేస్తే, 1902, 104 కాల్‌ సెంటర్లకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లు అధిక మొత్తంలో ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఫలితాలు త్వరగా వస్తాయని, కచ్చితత్వం ఎక్కువని ల్యాబ్‌ ప్రతినిధులు చేప్పే మాటలు నమ్మి, ఎక్కవ మొత్తం చెల్లించవద్దని సూచించారు. ప్రతి ల్యాబ్‌లో పరీక్షల ధరలు ప్రదర్శించాలని ఆదేశించారు. జిల్లాలో ఆరు ల్యాబ్‌లకు కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు (ఆర్టీపీసీఆర్‌) చేయడానికి అనుమతి ఇచ్చామన్నారు. జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల, కిమ్స్‌ వైద్య కళాశాల, సత్య స్కాన్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌, యక్యురేట్‌ ల్యాబ్‌, క్వాలిటీ కేర్‌ ల్యాబ్‌, శ్రీనివాస మెడికల్‌ సెంటర్‌కే అనుమతి ఇచ్చామన్నారు. డీఎంహెచ్‌వో(ఇన్‌ఛార్జి) బి.మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని