logo

78 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌

జిల్లాలో గత ఐదు రోజుల్లో (శుక్రవారం సాయంత్రం వరకు) వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 78 మంది ఉపాధ్యాయులు, 28 మంది విద్యార్థులు కొవిడ్‌ బారిన పడ్డారని డీఈవో ఎస్‌.అబ్రహం తెలిపారు. స్థానిక జడ్పీ బాలికోన్నత పాఠశాల, తాటి

Published : 23 Jan 2022 02:59 IST


మధ్యాహ్న భోజన పదార్థాలను పరిశీలిస్తున్న డీఈవో అబ్రహం తదితరులు

 

గొల్లప్రోలు: జిల్లాలో గత ఐదు రోజుల్లో (శుక్రవారం సాయంత్రం వరకు) వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 78 మంది ఉపాధ్యాయులు, 28 మంది విద్యార్థులు కొవిడ్‌ బారిన పడ్డారని డీఈవో ఎస్‌.అబ్రహం తెలిపారు. స్థానిక జడ్పీ బాలికోన్నత పాఠశాల, తాటిపర్తి ఉన్నత పాఠశాలను ఆయన శనివారం తనిఖీ చేశారు. జడ్పీటీసీ సభ్యుడు నాగలోవరాజుతో కలిసి మధ్యాహ్న భోజన పదార్థాలను పరిశీలించారు. అన్నం ముద్దగా, సాంబారు పలుచగా ఉందని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి భయంతో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు రెండ్రోజులుగా 20 శాతానికిపైగా తగ్గిందని డీఈవో తెలిపారు. 2020లో ఆర్‌ఎంఎస్‌ఏలో మంజూరైన తరగతి గదుల భవన పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. జిల్లాలో 115 పాఠశాలలకు సొంత భవనాలు లేవని, ఇతర చోట్లా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా భవనాల నిర్మాణానికి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని