logo

3 కిలోమీటర్ల దూరం పిల్లల్ని ఎలా పంపాలి..?

‘రెక్కాడితేగానీ.. డొక్కాడని కుటుంబాలు మావి. పనికి వెళ్లకపోతే పస్తులు ఉండాల్సిందే.. ఈ పరిస్థితుల్లో మా పిల్లలను మూడు కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలకు రోజూ ఎలా తీసుకువెళ్లగలమని’కొత్తతుంగపాడు ఎంపీపీ పాఠశాలవిద్యార్థు

Published : 23 Jan 2022 02:59 IST


కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

 

రాజానగరం: ‘రెక్కాడితేగానీ.. డొక్కాడని కుటుంబాలు మావి. పనికి వెళ్లకపోతే పస్తులు ఉండాల్సిందే.. ఈ పరిస్థితుల్లో మా పిల్లలను మూడు కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలకు రోజూ ఎలా తీసుకువెళ్లగలమని’కొత్తతుంగపాడు ఎంపీపీ పాఠశాలవిద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్‌ హరికిరణ్‌కు విజ్ఞప్తి చేశారు. అక్కడికి పంపించేందుకు రవాణా సౌకర్యమూ లేదని, దయచేసి మా పిల్లలను ఇదే పాఠశాలలో కొనసాగించాలని కోరారు. ప్రభుత్వ భవనాల ప్రారంభానికి శనివారం కొత్తతుంగపాడు వచ్చిన కలెక్టర్‌ను ఆ గ్రామంలోని 3, 4, 5 తరగతుల పిల్లల తల్లిదండ్రులు కలిసి వినతిపత్రం అందజేశారు.కొత్తతుంగపాడు నుంచి 3, 4, 5 తరగతుల పిల్లలు 80 మంది వరకు మూడు కి.మీ. దూరంలోని పాతతుంగపాడు జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లాలని ఉపాధ్యాయులు చెబుతున్నారన్నారు. దీనిపై కలెక్టర్‌ హరికిరణ్‌ స్పందిస్తూ ఇప్పుడు నేను చెప్పినా.. తాత్కాలికంగా ఉంచుతారే తప్ప, కొద్దిరోజుల తర్వాతైనా వేరే పాఠశాలకు పంపక తప్పదన్నారు. నూతన విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయక తప్పదని వారికి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని