logo

ఈట్‌ స్ట్రీట్‌ ఖాళీ..?

ఆకర్షణీయ నగరం కాకినాడలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈట్‌ స్ట్రీట్‌ ఆరునెల్లోనే అటకెక్కింది. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ మార్గదర్శకాల్లో ఈట్‌స్ట్రీట్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో రూ. మూడు కోట్ల నిధులతో స్థానిక పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆనుకు

Published : 23 Jan 2022 02:59 IST


దుకాణాలు లేకుండా ఖాళీగా..

బాలాజీచెరువు(కాకినాడ), న్యూస్‌టుడే: ఆకర్షణీయ నగరం కాకినాడలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈట్‌ స్ట్రీట్‌ ఆరునెల్లోనే అటకెక్కింది. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ మార్గదర్శకాల్లో ఈట్‌స్ట్రీట్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో రూ. మూడు కోట్ల నిధులతో స్థానిక పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆనుకుని దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీన్ని ఖాళీ చేశారు. ఈట్‌స్ట్రీట్‌ ఏర్పాటుతో కళాశాల లోపలికి చెత్త వేస్తున్నారని, ఇక్కడ డ్రైనేజీ మూసుకుపోయిందని, వీటన్నింటినీ బాగు చేసిన తరువాతే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశాలు రావడంతో తాత్కాలికంగా దీన్ని మూసివేశారు. సుమారు 60 మంది చిరువ్యాపారులు ఒక్కొక్కరు రూ.లక్ష వరకు వెచ్చించి బడ్డీలు తయారు చేయించుకున్నారు. అధికారుల ఆదేశాలతో వీటిని ఇక్కడి నుంచి తొలగించాల్సి వచ్చింది. ఈట్‌స్ట్రీట్‌ ప్రదేశానికి సమీపంలో ఉన్న మెక్లారిన్‌ పాఠశాల ఫుట్‌పాత్‌పై కొన్ని బడ్డీలను తాత్కాలికంగా ఏర్పాటు చేయగా.. వీటిని శనివారం నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది వాహనాల్లో తరలించారు. దీంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా తాత్కాలికంగానే ఈట్‌స్ట్రీట్‌ను నిలిపివేసినట్లు చెప్పారు. పీఆర్‌ డిగ్రీ కళాశాల వద్ద డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించి,త ్వరలో మళ్లీ దీన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడి వ్యాపారులు జేఎన్‌టీయూకే, బాలాత్రిపుర సుందరి ఆలయం తదితర ప్రాంతాలకు వెళ్లారని చెప్పారు. అన్ని పనులూ పూర్తయిన తరువాత నిజమైన వ్యాపారులకు మళ్లీ ఇక్కడ అవకాశం కల్పిస్తామన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో రెండు నెలలు దీన్ని మూసివేసి, ఈలోగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. మళ్లీ ఈట్‌స్ట్ట్రీట్‌ ఇక్కడే కొనసాగిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని