logo

దేశంలోనే మెరుగైన వ్యవస్థగా సచివాలయాలు

 ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలందించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే ఎక్కడా లేనివిధంగా మెరుగైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు

Published : 24 Jan 2022 05:04 IST


ఉద్యోగులకు ఏకరూప దుస్తులు అందిస్తున్న మంత్రి కన్నబాబు

సర్పవరంజంక్షన్‌: ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలందించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే ఎక్కడా లేనివిధంగా మెరుగైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ క్యాంపు కార్యాలయంలో ఆదివారం జడ్పీ సీఈవో సత్యనారాయణ అధ్యక్షతన ఆయన సచివాలయ ఉద్యోగులకు ఏకరూప దుస్తులందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నేరుగా సేవలందించేందుకు ఒకే నోటిఫికేషన్‌తో సుమారు 1.40లక్షలు మందిని నియమించారన్నారు. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జూన్‌ నాటికి ప్రొబేషన్‌ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి తెలిపారన్నారు. జడ్పీటీసీ సభ్యులు నులుకుర్తి రామకృష్ణ, ఎంపీడీవో నారాయణమూర్తి, పంచాయతీ కార్యదర్శి అహ్మదున్నీసా బీబీ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని