logo

24 గంటలు.. 1,012 కరోనా కేసులు

కొవిడ్‌ ఉద్ధృతి జిల్లాలో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 1,012 పాజిటివ్‌ కేసులు నమోదవగా ఇప్పటి వరకు 1,292 మంది మృతి చెందారు. మొత్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,01,755కి చేరింది. 2,94,193 మంది కోలుకోగా, ప్రస్తుతం 6,270

Published : 24 Jan 2022 05:04 IST

 

మసీదు సెంటర్‌ (కాకినాడ): కొవిడ్‌ ఉద్ధృతి జిల్లాలో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 1,012 పాజిటివ్‌ కేసులు నమోదవగా ఇప్పటి వరకు 1,292 మంది మృతి చెందారు. మొత్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,01,755కి చేరింది. 2,94,193 మంది కోలుకోగా, ప్రస్తుతం 6,270 క్రియాశీలక కేసులున్నాయి. గడిచిన వారం రోజుల్లో వెయ్యికి పైనే పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇది రెండోసారి. నిన్న 756 నమోదవ్వగా.. ఈ రోజు 256 కేసులు అధికంగా వెలుగు చూశాయి.

● ఇద్దరు ఎంపీలకు పాజిటివ్‌

మసీదుసెంటర్‌(కాకినాడ), వి.ఎల్‌.పురం : రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌ కరోనా బారినపడ్డారు. ఈ మేరకు వారు వేర్వేరుగా ప్రకటనల్లో పేర్కొన్నారు. భరత్‌రామ్‌ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండి వైద్య సేవలు పొందుతున్నారు. తాను కొవిడ్‌ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా ఆదివారం రిపోర్టు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు పరీక్ష చేయించుకోవడంతోపాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌తోపాటు ఆమె పీఏ, గన్‌మెన్‌, జెడ్‌ఆర్‌సీసీ సభ్యుడికి కూడా కరోనా సోకింది. ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో పరీక్షలు చేయించగా పాజిటివ్‌ వచ్చినట్లు ఎంపీ కార్యాలయ వర్గాలు ఆదివారం తెలిపాయి. ప్రస్తుతం ఆమె హోం ఐసొలేషన్‌లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని