logo

కార్యనిర్వహణాధికారి.. అర్చకుడిగా మారి..

ఆయన ఏడు ప్రధాన ఆలయాలకు ఈవో(కార్యనిర్వహణాధికారి). అర్చకులు రాకుంటే.. ఆలయాల్లో ఆయనే పూజాక్రతువులు నిర్వహిస్తారు. భక్తులకు ఇబ్బంది కలగకూడదని, ఆలయ సంప్రదాయాల ప్రకారం నిత్య కైంకర్యాలు జరగాల్సిందేనని తానే అర్చకుడిగా మా

Published : 24 Jan 2022 05:04 IST

 

ఆయన ఏడు ప్రధాన ఆలయాలకు ఈవో(కార్యనిర్వహణాధికారి). అర్చకులు రాకుంటే.. ఆలయాల్లో ఆయనే పూజాక్రతువులు నిర్వహిస్తారు. భక్తులకు ఇబ్బంది కలగకూడదని, ఆలయ సంప్రదాయాల ప్రకారం నిత్య కైంకర్యాలు జరగాల్సిందేనని తానే అర్చకుడిగా మారారు.. ఈవో చీమలకొండ రమణమూర్తి. పిఠాపురంలోని సకలేశ్వరస్వామి ఆలయానికి 40 ఏళ్లుగా వంశపారంపర్య అర్చకుడిగా ఫణి పనిచేసేవారు. బుధవారం నుంచి ఆయన ఆలయానికి రావడం మానేశారు. దాంతో రమణమూర్తి అర్చకుడిగా మారి రోజుకు వందకుపైగా భక్తులు వచ్చే ఈ ఆలయంలో ఉదయం, సాయంత్రం పూజాలు నిర్వహిస్తున్నారు. అర్చకుని నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. - న్యూస్‌టుడే, పిఠాపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని