logo

ధర మాయం.. కర్షకుడికి గాయం

కొంతకాలం కిందట ఆకాశాన్నంటిన టమాటా ధరలు ప్రస్తుతం నేలచూపులు చూస్తున్నాయి. గతేడాది అక్టోబరు, నవంబరులో మార్కెట్‌లో 25 కిలోలు హోల్‌సేల్‌గా రూ.1200-1500 మధ్య ఉండేది. డిసెంబరులో కాస్తంత తగ్గుముఖం పట్టి రూ.800-1000కు చే

Published : 24 Jan 2022 05:04 IST

 

కొంతకాలం కిందట ఆకాశాన్నంటిన టమాటా ధరలు ప్రస్తుతం నేలచూపులు చూస్తున్నాయి. గతేడాది అక్టోబరు, నవంబరులో మార్కెట్‌లో 25 కిలోలు హోల్‌సేల్‌గా రూ.1200-1500 మధ్య ఉండేది. డిసెంబరులో కాస్తంత తగ్గుముఖం పట్టి రూ.800-1000కు చేరింది. జనవరి మొదటివారం నుంచి తగ్గుతూవస్తోంది. ప్రస్తుతం 25 కిలోల బాక్సు ధర రూ.200 పలుకుతోంది. కోరుకొండ, సీతానగరం మండలాల్లో సుమారు 1200 ఎకరాల్లో వేసిన టమాటా కోతకు వచ్చి మార్కెట్‌లోకి వస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేదాంతోపాటు స్థానిక దిగుబడులు అందుతుండడంతో ధర పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 25 కిలోల బాక్సు ధర కనీసం రూ.500 ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. - న్యూస్‌టుడే, సీతానగరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని