logo

కొవిడ్‌కట్టడికి..౩ అంచెల వ్యూహం

ఆసుపత్రుల్లో ఆక్సిజన్, పడకలు ఏర్పాట్లపై దృష్టి సారించడం.. వ్యాధి నిర్ధారణ పరీక్షలు.. పీడితుల వైద్యానికి ప్రాధాన్యం.. ఈ వ΄డంచెల వ్యూహంతో కొవిడ్‌ను ఎదుర్కొంటామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. ‘జిల్లాలో వైరస్‌ విజృంభించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. ప్ర

Published : 24 Jan 2022 06:27 IST

‘ఈనాడు’తో  కలెక్టర్‌ హరికిరణ్‌ 

ఈనాడు, కాకినాడ ఆసుపత్రుల్లో ఆక్సిజన్, పడకలు ఏర్పాట్లపై దృష్టి సారించడం.. వ్యాధి నిర్ధారణ పరీక్షలు.. పీడితుల వైద్యానికి ప్రాధాన్యం.. ఈ వ΄డంచెల వ్యూహంతో కొవిడ్‌ను ఎదుర్కొంటామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. ‘జిల్లాలో వైరస్‌ విజృంభించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. ప్రజలనూ చైతన్యపరుస్తున్నామ’ని ఆయన అన్నారు. ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలు.. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు సన్నద్ధత.. కొవిడ్‌ కట్టడికి చేపడుతున్న చర్యలపై ‘ఈనాడు’తో ముఖాముఖి మాట్లాడారు. 

వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు..

ప్రస్తుత పరిస్థితుల్లో గుమిగూడడం, మాస్కు పెట్టుకోకుండా తిరగడం వంటివి శ్రేయస్కరం కాదు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, జలుబు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కొవిడ్‌ నిబంధనలతోపాటు.. రాత్రి కర్ఫ్యూ సమర్థ అమలుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. కొవిడ్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగానే వ్యవహరిస్తాం.

పాజిటివ్‌ కేసుల్లో రాష్ట్రంలోనే జిల్లా  అగ్రస్థానంలో ఉంది.. ముందస్తు సన్నద్ధత  ఎలా..?

ప్రస్తుత కేసుల్లో 90 శాతం మంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. ముందుజాగ్రత్తగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ సేవలకు 6,132 పడకలు సిద్ధం చేశాం. వీటిలో ఐసీóŸ΄ 704, నాన్‌ ఐసీóŸ΄ ఆక్సిజన్‌ 3,820,. సాధారణ 1,608 ఉన్నాయి. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో వెయ్యి పడకలు సిద్ధం చేశాం. జీజీహెచ్, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, ప్రాంతీయ ఆసుపత్రులు, సీహెచ్‌సీల్లో వనరులు సమకూర్చాం. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి కోసం 60వేల కిట్లు సిద్ధం చేశాం.  

కొవిడ్‌ మృతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.50వేల సహాయం ఎంత మందికి అందించారు..?

జిల్లాలో కొవిడ్‌ మృతులు అధికారిక లెక్కల ప్రకారం 1,291 మంది ఉంటే.. పరిహారం కోసం 4,578 మంది దరఖాస్తు చేస్తున్నారు. అనర్హత కారణంగా 272 మంది క్లైములు తిరస్కరించాం. రూ.50వేలు చొప్పున పరిహారం సొమ్ము 2,390 మందికి అందించాం. మిగిలిన దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయి. ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతా, కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిస్థాయిలో ఇవ్వనివారు 600 మంది వరకు ఉన్నారు. అర్హత ఉన్నవారికి పరిహారం కచ్చితంగా అందుతుంది. ఇక్కడ కొవిడ్‌ చికిత్సపొందుతూ చనిపోయిన వేరే జిల్లాలకు చెందిన వారి దరఖాస్తులనూ స్వీకరిస్తున్నాం.

ప్రైవేటు  వైద్యశాలలపై  పర్యవేక్షణ 

జిల్లాలో కొవిడ్‌ సేవలకు 51 ప్రైవేటు ఆసుపత్రులు నోటిఫై చేశాం. ఒక్కో ఆసుపత్రికి ఒక్కో నోడల్‌ అధికారిని నియమించాం. ఆయా వైద్యశాలల్లో 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ రోగులకు కేటాయించాలన్నది నిబంధన. నోడల్‌ అధికారులు ఆసుపత్రుల్లో నిబంధనల అమలు పర్యవేక్షిస్తారు.

ఆక్సిజన్‌  సరఫరాకు  తీసుకుంటున్న  చర్యలు

ఇప్పుడు వెలుగుచూస్తున్న కేసుల్లో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతున్నారు. జిల్లాలో ఆక్సిజన్‌ సామర్థ్యం అన్ని ఆసుపత్రుల్లో పెరిగింది. ప్రాణవాయువు ఉత్పత్తిచేస్తే పీఎస్‌ఏ ప్లాంటు కూడా అందుబాటులోకి వచ్చాయి. వంద పడకలు దాటిన పది ప్రైవేటు ఆసుపత్రుల్లో పీఎస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి.  

వైౖద్యశాలల్లో  సిబ్బంది నియామకం  ఎంతవరకు  వచ్చింది..?

వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాల ప్రక్రియ చేపట్టారు. గతంలో కొవిడ్‌లో అన్ని కేడర్లు కలిపి వెయ్యి మంది వరకు అదనపు సిబ్బందిని తీసుకున్నాం. ఆరునెలలు అయ్యాక వారి సేవలు నిలిపివేశాం. మళ్లీ ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే భర్తీకి చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ సమర్థ సేవలకు గతంలో వ΄డు షిఫ్టులకు ముగ్గురు చొప్పున రిసెప్షన్‌ దగ్గర పెట్టి పర్యవేక్షించాము.

వైరస్‌ కట్టడి..  పీడితులను గుర్తించి సమర్థ వైద్య సేవలకు తీసుకుంటున్న చర్యలేమిటి..?

కొవిడ్‌ పీడితుల కోసం కంట్రోల్‌రూమ్‌ను కలెక్టరేట్‌లోని విధాన గౌతమిలో ఏర్పాటుచేశాం. 104 కాల్‌చేసి సమస్య విన్నవించవచ్చు. కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారికి సిబ్బంది ఫోన్‌చేసి.. మందుల కిట్‌  అందిందా..? లేదా..? వాకబు చేస్తారు. మందులు అందిన తర్వాత ఎలా వాడాలో వివరిస్తారు. టెలీ కన్సల్టేషన్‌ ద్వారా వారికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరంగా చెబుతారు.ఇది నిరంతర ప్రక్రియ. కొవిడ్‌ పీడితులకు అత్యవసర 108 సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంచాం. కొవిడ్‌ పీడిత ప్రాంతాలు గుర్తించి.. పరీక్షలు నిర్వహించి.. సమర్థ వైద్యసేవలు అందేలా అనుశీలన చేస్తున్నాం. వ΄డు అంచెల్లో పర్యవేక్షణ సమర్థంగా సాగుతోంది. 

మందుల కిట్‌ అందిస్తున్న చిత్రం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని