logo

మన జానకికి గౌరవం

ప్రముఖ రంగస్థల, సినీ కథానాయిక షావుకారు జానకికి కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై నగర కళాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడు నుంచి ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమె రాజమహేంద్రవరంలో పుట్టి పెరిగారు. తండ్రి వెంకోజీరావు పేపరు పరిశ్రమలో నిపుణుడు. ఇంగ్లాండులో

Published : 26 Jan 2022 04:53 IST

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: ప్రముఖ రంగస్థల, సినీ కథానాయిక షావుకారు జానకికి కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై నగర కళాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడు నుంచి ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమె రాజమహేంద్రవరంలో పుట్టి పెరిగారు. తండ్రి వెంకోజీరావు పేపరు పరిశ్రమలో నిపుణుడు. ఇంగ్లాండులో పేపరు మాన్యుఫ్యాక్చరింగ్‌ అండ్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. వీరి పూర్వీకులు ఉత్తర భారతీయులు.ఉద్యోగరీత్యా ఆయన రాజమహేంద్రవరం వచ్చారు. జానకి 1931, డిసెంబరు 12న ఇక్కడే జన్మించారు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు. చెల్లెలు కృష్ణకుమారి సైతం సినీనటి. జానకి 11వ ఏటనే రేడియోలో ప్రసారమైన ఓ తెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. గోకవరం బస్టాండ్‌ నుంచి సబ్‌కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో వీరి నివాసం ఉండేది. ప్రస్తుతం అక్కడ కంటి ఆసుపత్రి ఉంది. తల్లి పేరు శచీదేవి. తండ్రి ఉద్యోగ రీత్యా కొంతకాలం తర్వాత మద్రాసు వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని