logo

సమస్యలపై నిగ్గదీతకు ఓటు దోహదం

సమస్యల పై ప్రశ్నించడానికి ఓటు అనే ఆయుధం దోహదపడుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ స్మార్ట్‌సిటీ కార్యాలయంలో 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని యువ ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, జేఎన్‌టీయూకే ఉప

Published : 26 Jan 2022 04:53 IST


గుర్తింపు కార్డులు పొందిన యువతతో కలెక్టర్‌, ఎస్పీ, వీసీ తదితరులు

కాకినాడ కలెక్టరేట్‌: సమస్యల పై ప్రశ్నించడానికి ఓటు అనే ఆయుధం దోహదపడుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ స్మార్ట్‌సిటీ కార్యాలయంలో 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని యువ ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, జేఎన్‌టీయూకే ఉపకులపతి ప్రసాదరాజు, ఆదాయ పన్నుల శాఖ కమిషనర్‌ డాక్టర్‌ సుప్రియో.డితో కలిసి కలెక్టర్‌ జ్యోతి వెలిగించి సదస్సు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, అర్హత ఉన్న ప్రతిఒక్కరూ ఓటు నమోదు చేసుకుని, వినియోగించాలన్నారు. గుజరాత్‌ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో ఒకే ఒక్క ఓటరు ఉన్నా.. పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న లెహ్‌ ప్రాంతంలో 1200 మంది ఓటర్ల కోసం పోలింగ్‌ కేంద్రం నెలకొల్పి ఓటు విలువను కేంద్ర ఎన్నికల సంఘం చాటిచెప్పిందన్నారు. జిల్లాలో ఇంకా 19-20 ఏళ్ల మధ్య వయసున్న వారు 20వేల మంది ఓటుకు దూరంగా ఉన్నారని, వీరంతా నమోదు చేసుకోవాలన్నారు. కమిషనర్‌ స్వప్నిల్‌, ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ, తహసీల్దారు వైహెచ్‌ఎస్‌ సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని