logo

గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

గణతంత్ర దినోత్సవ వేడుక జిల్లాస్థాయి కార్యక్రమ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం స్థానిక పోలీసు కవాతు మైదానంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేడుకలు నిర్వహిస్తారు. 9 గంటలకు కలెక్టర్‌ హరికిరణ్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. తర్వాత సంప్రదాయ కవాతు, కలెక్టర్‌ ప్రసంగం, శక

Published : 26 Jan 2022 04:53 IST

 


కాకినాడ పోలీసు పరేడ్‌ మైదానం ముస్తాబు

కాకినాడ కలెక్టరేట్‌: గణతంత్ర దినోత్సవ వేడుక జిల్లాస్థాయి కార్యక్రమ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం స్థానిక పోలీసు కవాతు మైదానంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేడుకలు నిర్వహిస్తారు. 9 గంటలకు కలెక్టర్‌ హరికిరణ్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. తర్వాత సంప్రదాయ కవాతు, కలెక్టర్‌ ప్రసంగం, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు, అధికారులకు విశిష్ట సేవా పురస్కారాలు అందజేస్తారు.

భళా.. సింహాచలం

సర్పవరం జంక్షన్‌: కాకినాడ 3వ ఏపీఎస్పీ బెటాలియన్‌లో ఏఆర్‌ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సత్తారు సింహాచలం గణతంత్ర దినోత్సవర సందర్భంగా ఇచ్చే ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. 1984లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి హెడ్‌ కానిస్టేబుల్‌గా 12 ఏళ్లుగా సేవలందించి మూడేళ్ల కిందట ఏఆర్‌ఎస్సైగా ఉద్యోగోన్నతి పొందారు.

ఎస్పీకి పోలీసు మెడల్‌

మసీదుసెంటర్‌: జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబుకు భారత పోలీస్‌ పతాకాన్ని ప్రకటించారు. పోలీస్‌ శాఖలో విశిష్ట సేవలు అందించినందుకు ఈ పురస్కారం ఎస్పీని వరించింది. ఈయన స్వస్థలం కడప. మొదటగా 2001లో గురజాల సబ్‌డివిజన్‌ ఎస్పీడీవోగా పనిచేశారు. హైదరాబాద్‌ టాస్క్‌పోర్సు డీసీపీగా సేవలందించారు. 2007లో కఠిన సేవా పతకం, 2009లో పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంటరీ, 2017లో ఉత్తమ సేవాపతకాలు పొందారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని