logo

దేశభక్తి చాటేలా.. సూక్ష్మ త్రివర్ణ పతాకం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన సూక్ష్మ కళాఖండాల నిపుణుడు ఆరిపాక రమేష్‌బాబు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సూక్ష్మ త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. 10 మిల్లీగ్రాముల బంగారంతో, ఒక మిల్లీ మీటరు ఎత్తుతో ఉండే త్రివర్ణ పతాకాన్ని గుండుసూది మొనపై నిలిచేలా తయారు చేశారు

Published : 26 Jan 2022 04:53 IST


సూక్ష్మ త్రివర్ణ పతాకాన్ని కలెక్టర్‌కు అందజేస్తున్న రమేష్‌బాబు

 

కాకినాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన సూక్ష్మ కళాఖండాల నిపుణుడు ఆరిపాక రమేష్‌బాబు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సూక్ష్మ త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. 10 మిల్లీగ్రాముల బంగారంతో, ఒక మిల్లీ మీటరు ఎత్తుతో ఉండే త్రివర్ణ పతాకాన్ని గుండుసూది మొనపై నిలిచేలా తయారు చేశారు. దీన్ని చూడాలంటే భూతద్దం, మైక్రోస్కోప్‌ సహాయం తీసుకోవాల్సిందే. సూక్ష్మ త్రివర్ణ పతాక కళాకృతిని మంగళవారం కలెక్టర్‌ సి.హరికిరణ్‌కు అందజేయగా, ఆయన రమేష్‌బాబును అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని