logo

గ్రావెల్‌ తరలింపు లారీల స్వాధీనం

ఏడీబీ రహదారిలో గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్న 8 లారీలను డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలతో ఎస్సై మురళీమోహన్‌ సిబ్బందితో కలిసి మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. దస్త్రాలు సరిగా లేవని, మట్టి తరలింపునకు అనుమతుల్లేవని మైనింగ్‌, రెవెన్యూ అధికారులకు తెలిపామని ఎస్సై పేర్కొన్నారు. ఇదిలా ఉండగా

Published : 26 Jan 2022 04:54 IST

పెద్దాపురం: ఏడీబీ రహదారిలో గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్న 8 లారీలను డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలతో ఎస్సై మురళీమోహన్‌ సిబ్బందితో కలిసి మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. దస్త్రాలు సరిగా లేవని, మట్టి తరలింపునకు అనుమతుల్లేవని మైనింగ్‌, రెవెన్యూ అధికారులకు తెలిపామని ఎస్సై పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మట్టి తరలింపు వ్యవహారంలో మెట్ట ప్రాంతానికి చెందిన ఓ ఎస్సై భర్త పాత్ర ఉన్నట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్న స్లిప్పుల ఆధారంగా తెలుస్తోంది. పట్టుకున్న లారీలను విడిచిపెట్టాలని ఓ నాయకుడు నుంచి ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ అంశం వివాదాస్పదమవడంతో జిలా ఎస్పీ దృష్టికి వెళ్లగా ఆరా తీస్తున్నట్లు విశ్వనీయంగా తెలిసింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని