logo

రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావాలి: సోము

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీలు అందినంత దోచుకుతింటున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. కిర్లంపూడి మండలం బూరుగుపూడిలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

Published : 27 Jan 2022 04:40 IST


మాట్లాడుతున్న వీర్రాజు, వేదికపై నాయకులు

 

కిర్లంపూడి(జగ్గంపేట గ్రామీణం), గండేపల్లి: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీలు అందినంత దోచుకుతింటున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. కిర్లంపూడి మండలం బూరుగుపూడిలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సిమెంటు, ఇసుక, మద్యం రేట్లు మండుతున్నాయన్నారు. రోడ్లు దుస్థితిలో ఉన్నాయన్నారు. ప్రత్తిపాడు మండలంలో వంతాడ క్వారీ, పెద్దాపురం సమీపంలో కొండలను నిత్యం తవ్వుతూ సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు పార్టీలో చేరగా ఆహ్వానించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వానికి ఆర్థికవిధానం లేదన్నారు. పార్టీ నాయకులు ఏటుకూరి సూర్యనారాయణరాజు, తోట సర్వారాయుడు, రేలంగి శ్రీదేవి, చిలుకూరి రామ్‌కుమార్‌, దాట్ల కృష్ణవర్మ తదితరులు పాల్గొన్నారు. మురారిలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు కామినేని జయశ్రీ ఆధ్వర్యంలో ఆయనకు స్వాగతం పలికారు. తాము అధికారంలోకి వస్తే సిమెంట్‌, ఇసుక ధరలు తగ్గిస్తామని సోము వీర్రాజు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు