logo

జీవోల సమగ్ర సమాచారం కోరుతూ స.హ. చట్టానికి దరఖాస్తు

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి అశుతోష్‌ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదిక తక్షణం బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేస్తు ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలు, జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌తో 12 సార్లు జ

Published : 27 Jan 2022 04:40 IST

పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల

రాజమహేంద్రవరం (దానవాయిపేట), రాజానగరం: ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి అశుతోష్‌ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదిక తక్షణం బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేస్తు ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలు, జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌తో 12 సార్లు జరిపిన సమావేశాల వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఆ మేరకు పీఆర్సీ నివేదికలు, ప్రభుత్వ జీవోలకు సంబంధించి సమగ్ర సమాచారం కోరుతూ సమాచార హక్కు చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు ఆయన వెల్లడించారు. పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు నిరసనకు దిగడంతో చర్చల్లో పాల్గొన్న నాలుగు సంఘాల అగ్ర నాయకులు కంగుతిన్నారన్నారు. ముఖ్యమంత్రిని పొగిడిన ఆ యూనియన్ల అగ్ర నేతలు ఇప్పుడు సమ్మె నోటీసులు ఇవ్వడం గమనార్హమన్నారు. ప్రభుత్వం సోషల్‌ మీడియాతో ఉద్యోగులపై బురద జల్లడం, ప్రజలను పక్కదోవ పట్టించడం వంటి చర్యలు సిగ్గుచేటన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని