logo

ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించాలి

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో విలీనం చేయాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మండపేట రాజమహేంద్రవరం పార్లమెం

Published : 27 Jan 2022 04:40 IST


ఎమ్మెల్యే వేగుళ్ల

 

మండపేట, న్యూస్‌టుడే: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో విలీనం చేయాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మండపేట రాజమహేంద్రవరం పార్లమెంట్‌లో ఉండేదని, 2009లో నూతనంగా ఏర్పాటైన మండపేట నియోజకవర్గాన్ని అమలాపురం పార్లమెంట్‌ పరిధిలోకి మార్చారని గుర్తు చేశారు. కొత్తగా అమలాపురం జిల్లా ప్రకటించి అందులో మండపేట నియోజకవర్గం చేర్చడం సబబుకాదన్నారు.

పెదపూడిని కాకినాడ జిల్లాలో కలిపితే మేలు..

అనపర్తి: పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ప్రభుత్వాన్ని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. రామవరంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెదపూడి మండలం కాకినాడకు సరాసరి 8 కిమీ దూరంలో ఉంటుందన్నారు. రాజమహేంద్రవరానికి 75 కి.మీలు దూరంలో పెదపూడి మండలం ఉందన్నారు. పెదపూడి మండలం కాకినాడ జిల్లాలో ఉంటే ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

రామకృష్ణారెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని