logo

ఉద్యోగినికి మద్యం డిపో మేనేజరు వేధింపులు

న్నతాధికారి అయినా తన వంకర బుద్ధిని ప్రదర్శించి.. కింది స్థాయి ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించారు. ఆపై వేధింపులకు పాల్పడ్డారు. ఎవరితోనూ తన ఆవేదనను చెప్పుకోలేక కొంత కాలంగా కుంగిపోయింది. బాధ భరించలేక ఎట్టకేలకు జిల్లా కేంద్రంలోని దిశ పోలీసులను ఆశ్రయించింది. అమలాపురంలోని ప్రభుత్వ మ

Published : 27 Jan 2022 04:40 IST

అమలాపురం పట్టణం: ఉన్నతాధికారి అయినా తన వంకర బుద్ధిని ప్రదర్శించి.. కింది స్థాయి ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించారు. ఆపై వేధింపులకు పాల్పడ్డారు. ఎవరితోనూ తన ఆవేదనను చెప్పుకోలేక కొంత కాలంగా కుంగిపోయింది. బాధ భరించలేక ఎట్టకేలకు జిల్లా కేంద్రంలోని దిశ పోలీసులను ఆశ్రయించింది. అమలాపురంలోని ప్రభుత్వ మద్యం డిపో మేనేజర్‌ వై.ఆదినారాయణమూర్తి వేధింపులకు గురి చేస్తున్నారని బాధిత యువతి ఫిర్యాదు చేయగా అమలాపురం స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పట్టణ పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. నల్లవంతెన బైపాస్‌ రోడ్డు వద్ద ఉన్న మద్యం డిపోలో విధులు నిర్వర్తిస్తున్న యువతితో డిపో మేనేజర్‌ ఆదినారాయణ అసభ్యంగా ప్రవర్తించి మానసికంగా ఇబ్బందికి గురిచేస్తున్నట్లు తెలిపారు. తనతో మాట్లాడిన ఆడియో రికార్డులు, సంక్షిప్త సందేశాలు ఆమె అందజేసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగా భవానీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని