logo

రూ.168 కోట్లతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.168 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ పాఠశాలల్లో నాడు-నేడు పనులపై గురువారం నిర్వహించిన దూరదృశ్య సమీక్ష సమావేశంలో కలెక్టరేట్‌ నుంచి కలెక్ట

Published : 20 May 2022 05:45 IST

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.168 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ పాఠశాలల్లో నాడు-నేడు పనులపై గురువారం నిర్వహించిన దూరదృశ్య సమీక్ష సమావేశంలో కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌, డీఈవో అబ్రహం, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 442 పాఠశాలల్లో 811 అదనపు తరగతి గదులు, నీటివసతి, మరుగుదొడ్లు వంటి నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పది రోజుల్లో ప్రతి సచివాలయం పరిధిలో ఒక పని ప్రారంభించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఆయా పాఠశాలల్లో చేపట్టే పనులను పేరెంట్స్‌ కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత పేరెంట్స్‌ కమిటీ, ప్రధానోపాధ్యాయులు, ఇంజినీరింగ్‌ అధికారుల సమన్వయంతో చేపట్టాలన్నారు. అవసరమైతే మండల విద్యాశాఖాధికారిని నోడల్‌ అధికారిగా నియమించి పనులు జరిగే పాఠశాలల్లో ఇసుక, సిమెంట్‌, ఐరన్‌ తదితర మెటీరియల్‌ సక్రమంగా సరఫరా అయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని