logo

మూడు దశల్లో భూముల రీసర్వే

భూ వివాదాలు, సమస్యల శాశ్వత పరిష్కారానికి జిల్లాలో మూడు దశల్లో భూముల రీ సర్వే నిర్వహించనున్నారు. ఇప్పటికే తొలిదశ పనులు ప్రారంభంకాగా ఇవి వేగవంతమయ్యేలా కలెక్టర్‌ కె.మాధవీలత సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. జగనన్న శాశ్వత భూహక్కు-

Published : 20 May 2022 05:45 IST


దూరదృశ్య సమావేశంలో కలెక్టర్‌, జేసీ

 

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): భూ వివాదాలు, సమస్యల శాశ్వత పరిష్కారానికి జిల్లాలో మూడు దశల్లో భూముల రీ సర్వే నిర్వహించనున్నారు. ఇప్పటికే తొలిదశ పనులు ప్రారంభంకాగా ఇవి వేగవంతమయ్యేలా కలెక్టర్‌ కె.మాధవీలత సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం అమలులో భాగంగా జిల్లాలో 272 గ్రామాల్లో క్షేత్రస్థాయిలో భూముల రీసర్వే చేపట్టాల్సి ఉంది. తొలిదశలో 81 గ్రామాల్లో, రెండో దశలో 89 గ్రామాల్లో, మూడో దశలో 102 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. తొలిదశ రీసర్వే పనులు మిగిలిన గ్రామాల్లో కూడా వేగవంతంగా పూర్తి చేయడంతోపాటు రెండు, మూడు దశల్లో చేపట్టాల్సిన రీసర్వే వచ్చే ఏడాది జులై 15 నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు అమలు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి రీసర్వే వేగవంతానికి చర్యలు తీసుకోవడంతోపాటు జిల్లాలోని ఆయా మండలాల తహసీల్దార్లకు లక్ష్యాలు నిర్దేశించాలని రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీవోలు చైత్రవర్షిణి, మల్లిబాబులను ఆదేశించారు. తొలుత భూముల రీ సర్వేపై గురువారం సీసీఎల్‌ఏ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, తదితరులు దూరదృశ్య సమావేశం ద్వారా జిల్లా కలెక్టర్‌, జేసీలతో సమీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని