logo

సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర రాక నేడు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులతో శ్రీకాకుళంలో ప్రారంభమైన రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర శుక్రవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చేరుకోనుంది. తొలుత తునిలో మధ్యాహ్నం యాత్ర ప్రవేశిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సాయంత్రం 4 గంట

Updated : 27 May 2022 05:35 IST


మున్సిపల్‌ స్టేడియంలో సిద్ధమైన సభావేదిక

వి.ఎల్‌.పురం: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులతో శ్రీకాకుళంలో ప్రారంభమైన రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర శుక్రవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చేరుకోనుంది. తొలుత తునిలో మధ్యాహ్నం యాత్ర ప్రవేశిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సాయంత్రం 4 గంటల సమయానికి చేరుకుంటుంది. అనంతరం ఇక్కడి నాగులచెరువు బజార్‌ వద్ద ఉన్న మున్సిపల్‌ స్టేడియం ఆవరణలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బస్సుయాత్రకు తుని నుంచి రాజమహేంద్రవరం వరకు వైకాపా శ్రేణుల ఆధ్వర్యంలో అడుగడుగునా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ఆయా మార్గాల్లో వాహనాల మళ్లింపునకు పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ సభ స్థలంలో ఏర్పాట్లను తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగితో కలిసి గురువారం వైకాపా జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా పరిశీలించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 50 వేలమంది వరకు పార్టీశ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నామన్నారు

సాగేదిలా...

బస్సు యాత్ర శుక్రవారం మధ్యాహ్నం 12.20 గంటలకు తుని చేరుకుంటుంది. ఒంటిగంట నుంచి 2 గంటల వరకు అన్నవరంలో మంత్రుల బృందం భోజనాలు చేసి తర్వాత.. యాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు కత్తిపూడి, 2.45 గంటలకు జగ్గంపేట, 3.30 గంటలకు రాజమహేంద్రవరం లాలాచెరువు జంక్షన్‌ వద్దకు చేరిక. అక్కడి నుంచి నగరంలోని ప్రభుత్వాసుపత్రి రోడ్డులోంచి వై.జంక్షన్‌, నందంగనిరాజు జంక్షన్‌, తాడితోట జంక్షన్‌, మీదుగా ఇక్కడి మున్సిపల్‌ స్టేడియానికి చేరిక. ఆపై బహిరంగ సభ.

 

ఏర్పాట్లపై చర్చిస్తున్న ఎస్పీ రస్తోగి, ఎమ్మెల్యే రాజా తదితరులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని