logo

పీహెచ్‌డీ చేసే అవకాశం లేక.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య

ఆ అమ్మాయి ఉన్నత చదువులు చదువుకుంది. ఉద్యోగావకాశం కూడా వచ్చింది. కానీ పీహెచ్‌డీ చేయాలనేది ఆమె కల. ఆర్థిక కారణాల రీత్యా ఉద్యోగం చేయమని ఇంట్లో అన్నారు. మనస్థాపంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం

Updated : 26 Jun 2022 05:02 IST

శ్రీదేదివ్య (పాత చిత్రం)

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: ఆ అమ్మాయి ఉన్నత చదువులు చదువుకుంది. ఉద్యోగావకాశం కూడా వచ్చింది. కానీ పీహెచ్‌డీ చేయాలనేది ఆమె కల. ఆర్థిక కారణాల రీత్యా ఉద్యోగం చేయమని ఇంట్లో అన్నారు. మనస్థాపంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది. గ్రామీణ ఎస్సై జి.సతీష్‌ కథనం ప్రకారం.. నందమూరుకు చెందిన యంగల చినబాబు విశ్రాంత ఆర్మీ ఉద్యోగి. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నారు. ఆయన కుమార్తె శ్రీదేదివ్య(22) ఏలూరులో ఎమ్మెస్సీ (న్యూట్రిషియన్‌) చదివి విశాఖపట్టణంలోని ఓ ఆసుపత్రిలో రెండునెలలు ఇంటర్న్‌షిప్‌ చేశారు. ఈనెల 24న స్వగ్రామం వచ్చారు. తనకు అక్కడే ఉద్యోగం వచ్చిందని, కానీ పీహెచ్‌డీ చేయాలని ఉందని ఇంట్లో చెప్పింది. ఆర్ధిక పరిస్థితి బాగోనందున ఉద్యోగం చేయమని చెప్పారు. శనివారం తెల్లవారుజామున చినబాబు లేచి చూసేసరికి దేదివ్య నోటి నుంచి నురగలు వస్తున్నాయి. పొలానికి తెచ్చిన పురుగు మందు తాగి ఉంటుందని గుర్తించి కుమారుడితో కలసి హుటాహుటిన కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని