Andhra news: తుని మండలంలోకి ప్రవేశించిన బెబ్బులి

అడుగులతో అలజడి రేపుతున్న పులి నచ్చినట్టు వేటాడుతూ సంచరిస్తోంది. తాజాగా రౌతులపూడి నుంచి  తుని మండలంలోకి ప్రవేశించింది. కుమ్మరిలోవ కాలనీ వద్ద రోడ్గు దాటుతున్న పులిని...

Published : 28 Jun 2022 02:03 IST

తుని: అడుగులతో అలజడి రేపుతున్న పులి నచ్చినట్టు వేటాడుతూ సంచరిస్తోంది. తాజాగా రౌతులపూడి నుంచి  తుని మండలంలోకి ప్రవేశించింది. కుమ్మరిలోవ కాలనీ వద్ద రోడ్గు దాటుతున్న పులిని స్థానికులు గుర్తించారు. కుమ్మరిలోవ-కొలిమేర మధ్య అధికారులు పులి పాదముద్రలను సేకరించారు. మరోవైపు, ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఉప ప్రణాళిక ప్రాంతంలోని సమీప గ్రామాల్లో రోజుకు పది నుంచి 20 కిలోమీటర్లు పయనించిన ఈ పులి ప్రవర్తన అర్థంకాక అటవీశాఖ అధికారులు తలలు పట్టుకొంటున్నారు. నిన్నటివరకు అది దాదాపు 150 చదరపు కి.మీ. విస్తీర్ణంలో సంచరించింది. నిన్న రౌతులపూడి మండలం ఎ.మల్లవరం, లచ్చిరెడ్డిపాలెం గ్రామాల్లో పులి అడుగుజాడలు జనాన్ని భయాందోళనకు గురిచేయగా.. తాజాగా ఈ పులి తుని మండలంలోకి ప్రవేశించడంతో అక్కడి ప్రజల్లో గుబులు రేపుతోంది.  

పులి ఇప్పటివరకు 8 పశువులను వేటాడింది. 9 పశువులను గాయపరిచింది. జనం కంట పడకుండా నక్కడానికి అనువైన కొండలు, డొంకలు ఉండడమే కాదు.. ఆహార వైవిధ్యం ఈప్రాంతంలో పులికి పుష్కలంగా ఉంది. వచ్చిన దారిన వెళ్లేందుకు వర్షాల కారణంగా కొంత తడబడుతోందని అధికారులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని