logo

పారదర్శకంగా బదిలీల ప్రక్రియ

ఉమ్మడి జిల్లా పరిషత్తు పరిధిలో బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేశామని జడ్పీ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. జడ్పీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుక్రవారం అందుకు సంబంధించిన ఉత్తర్వులు అందజేశారు. జడ్పీ

Published : 02 Jul 2022 03:33 IST

ఎంపీడీవో ఝాన్సీకి ఉత్తర్వులు అందజేస్తున్న జడ్పీ ఛైర్మన్‌

కాకినాడ నగరం: ఉమ్మడి జిల్లా పరిషత్తు పరిధిలో బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేశామని జడ్పీ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. జడ్పీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుక్రవారం అందుకు సంబంధించిన ఉత్తర్వులు అందజేశారు. జడ్పీ ఛైర్మన్‌ మాట్లాడుతూ జడ్పీ కార్యాలయం, మండల పరిషత్‌ కార్యాలయాలు, పాఠశాలలు, ఇంజినీరింగు విభాగాల్లో పనిచేస్తున్న అన్ని క్యాడర్ల ఉద్యోగులు కలిపి 476 మందికి బదిలీలు చేసినట్లు పేర్కొన్నారు. వీరిలో 14 మంది ఎంపీడీవోలు ఉన్నారన్నారు. జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ మాట్లాడుతూ అయిదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న అందరికీ బదిలీలు కల్పించామన్నారు. జడ్పీ డిప్యూటీ సీఈవో  నారాయణమూర్తి, పాలనాధికారి సుబ్బారావు, పీఆర్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్‌,  పాల్గొన్నారు.

దేవాదాయ శాఖలో...
గాంధీనగర్‌: దేవాదాయ శాఖలో భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. ఈవోలకు కమిషనర్‌ కార్యాలయంలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయ ఉద్యోగులు సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లకు డీసీ కార్యాలయంలో ప్రక్రియ నిర్వహించారు. 73మంది ఈవోలకు స్థానచలనం కల్పించారు. 6బీ పరిధిలోకి వచ్చే ఆలయాలు, సత్రాల్లో పనిచేసే ఉద్యోగులు సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లను బదిలీలు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్‌ అసిస్టెంట్లు 7, జూనియర్‌ అసిస్టెంట్‌ 45మందిని బదిలీ చేశారు. కమిషనర్‌ కార్యాలయం నుంచి వచ్చిన జాబితా ప్రకారం 6ఏ పరిధిలో ఆలయాలు, సత్రాల్లో ఉమ్మడి జిల్లాలో సూపరింటెంటెంట్‌లు 11మంది, జూనియర్‌ అసిస్టెంట్లు 30, సీనియర్‌ అసిస్టెంట్ల 30, రికార్డు అసిస్టెంట్లు 11మందికి స్థానచలనం కల్పించారు.

విద్యుత్తు శాఖలో...
టి.నగర్‌: విద్యుత్‌ శాఖలో విశాఖ కార్పొరేట్‌ కార్యాలయం డీఈఈగా ఉన్న ఏవీ శివ కుమార్‌ను రాజమహేంద్రవరం ట్రాన్స్‌కో క్వాలిటీ కంట్రోల్‌ డీఈఈగా బదిలీ చేశారు. ఇక్కడ డీఈఈ కమర్షియల్‌గా ఉన్న పి.సన్యాసిరావును అనపర్తి డీఈఈగా బదిలీ చేశారు. రాజమహేంద్రవరం పట్టణ-2 డీఈఈగా ఉన్న పీబీ నటరాజన్‌ జంగాను పిఠాపురం డీఈఈగా పంపించారు. బొమ్మూరు ప్రొటెక్షన్‌-1లో డీఈఈగా ఉన్న బి.సూర్యనారాయణను జగ్గంపేట డీఈఈగా బదిలీ చేశారు. రాజమహేంద్రవరంలో ఈఈ(ఎంఅండ్‌పీ)గా ఉన్న కె.రత్నాలరావును జగ్గంపేట ఈఈగా బదిలీ చేశారు. కాకినాడ ఈఈ(ఓ)గా ఉన్న ఎన్‌.ఉదయ్‌భాస్కర్‌ను రాజమహేంద్రవరం ఈఈ(ఎంఅండ్‌పీ) విభాగానికి పంపించారు. జగ్గంపేట ఈఈ(ఓ)గా ఉన్న ఏనుగుపల్లి డేవిడ్‌ను రాజమహేంద్రవరం ఈఈగా బదిలీ చేశారు.

రెవెన్యూలో తెగని పంచాయితీ
కాకినాడ కలెక్టరేట్‌: రెవెన్యూశాఖలో బదిలీ పంచాయితీ కొనసాగుతోంది. గురువారం అర్ధరాత్రి 12 గంటలతో బదిలీ గడువు ముగిసినా, శుక్రవారం రాత్రి వరకు ఈ క్రతువు సాగింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి తహసీల్దార్లు, ఉపతహసీల్ధార్లు, వీఆర్వో, సీనియర్‌, జూనియర్‌ సహాయకులు, ఆఫీసు సబార్డినేట్స్‌ బదిలీల ప్రక్రియను కాకినాడ కలెక్టరేట్‌ కేంద్రంగా నిర్వహిస్తున్నారు. వీటిలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీల ఆప్షన్‌ ఇచ్చిన వారికి ఇక్కడి నుంచే ప్రక్రియ పూర్తి చేస్తాయి. జిల్లాల స్థాయిలో బదిలీలు కోరుకునే వారికి మిగతా మూడు జిల్లాల కలెక్టర్లు దీన్ని నిర్వహించాలి. వాటిలో కూడా ఇప్పటికీ బదిలీల ప్రక్రియ పూర్తికాలేదు. దీనంతటికీ ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే సిఫార్సు లేఖలు కారణంగా నిలుస్తున్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని