logo

Godavari : 1986 ఆగస్టులోనే గోదావరి ఉగ్రరూపం

గోదావరి నదికి జులై నుంచి సెప్టెంబరు వరకు వరద నీరు రావడం సహజం. ఈ మూడు నెలల మధ్యలో గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉద్ధృత వరదలు సంభవిస్తుంటాయి. జులై 21, 1861 నుంచి మొదలుకుని నేటివరకు గోదావరి నదికి

Updated : 14 Jul 2022 07:46 IST

పి.గన్నవరం, న్యూస్‌టుడే: గోదావరి నదికి జులై నుంచి సెప్టెంబరు వరకు వరద నీరు రావడం సహజం. ఈ మూడు నెలల మధ్యలో గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉద్ధృత వరదలు సంభవిస్తుంటాయి. జులై 21, 1861 నుంచి మొదలుకుని నేటివరకు గోదావరి నదికి వచ్చిన ఉద్ధృత వరదలకు సంబంధించి 1986 ఆగస్టు 16న వచ్చిన అత్యంత భారీ వరద గోదావరి వరదల చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఆ రోజు ధవళేశ్వరం బ్యారేజి నుంచి సముద్రంలోకి 35,06,388 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలారు. ఆ ప్రభావంతో కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంకవద్ద వశిష్ఠ ఎడమ ఏటిగట్టు ఏకంగా ఏడుచోట్ల తెగిపోయి రాజోలు దీవి జలమయం అయ్యింది. 2006 ఆగస్టు 6న గోదావరి నదికి ఉద్ధృత స్థాయిలో వరద రావడంతో 28,50,664 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలారు. ఈ ప్రభావంతో అదేరోజు రాత్రి పి.గన్నవరం మండలం మొండెపులంక వద్ద వశిష్ఠ ఎడమ ఏటిగట్టు, అయినవిల్లి మండలం శానపల్లిలంకవద్ద గౌతమి కుడి ఏటిగట్టుకు గండ్లుపడ్డాయి. అనంతరం 1986 వరద స్థాయిని ప్రామాణికంగా తీసుకుని గోదావరి జిల్లాల్లో ఏటిగట్లను పటిష్ఠపరిచారు.

జులైలో తీసుకుంటే...

1861 నుంచి ఇంతవరకు జులై నెలలో ధవళేశ్వరం బ్యారేజివద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి వివిధ స్థాయిల్లో గోదావరి నదికి 13 సార్లు ఉద్ధృత వరదలు వచ్చాయి. ఇక ఆగస్టులో 1861 నుంచి గత ఏడాది వరకు గోదావరి నదికి 39సార్లు మొదటి ప్రమాదహెచ్చరిక స్థాయిని దాటి వివిధ స్థాయిల్లో ఉద్ధృత వరదలు వచ్చాయి. 1986 ఆగస్టు 16 ఉద్ధృత వరదలు తరువాత రెండోస్థానాన్ని ఆగస్టు 16, 1953న వచ్చిన ఉద్థృత వరదలు గోదావరి వరద చరిత్రలో రెండో స్థానంలో ఉంది. 1953 ఆగస్టు 16న 30,03,100 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని