logo

గోదావరికి మళ్లీ వరద

గోదావరి నదికి మళ్లీ వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడుతుండటంతో ప్రవాహ వేగం మరింత పెరుగుతోంది. మంగళవారం రాత్రికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 10.20 అడుగులకు చేరింది. 7,74,142 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

Published : 10 Aug 2022 06:13 IST

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: గోదావరి నదికి మళ్లీ వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడుతుండటంతో ప్రవాహ వేగం మరింత పెరుగుతోంది. మంగళవారం రాత్రికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 10.20 అడుగులకు చేరింది. 7,74,142 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జులైలోనే గోదావరికి వరదలు వచ్చాయి. గత నెలలో మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి మించి ప్రవహించింది. గత నెల 17న అత్యధికంగా 21.70 అడుగులకు నీటిమట్టం చేరగా, 25,85,736 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. 31 నాటికి బ్యారేజీ వద్ద నీటి మట్టం 8 అడుగులకు తగ్గడంతో సాధారణ స్థితికి చేరింది. ప్రస్తుతం వరద వస్తుండటంతో రెండు అడుగుల పైకి చేరింది. ఒక్కరోజులోనే రెండు అడుగుల మేర నీటి మట్టం పెరగడం గమనార్హం. బ్యారేజీ వద్ద నీరు ఒక్కసారిగా పెరగడంతో 175 గేట్లు ఎత్తివేశారు. బుధవారం తెల్లవారుజామున మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని