logo

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని బొమ్మూరు గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారిత అధికారి కేఎన్‌ జ్యోతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై గిరిజన జెండాను ఆవిష్కరించారు.

Published : 10 Aug 2022 06:13 IST

అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో చైతన్య ప్రదర్శన

ధవళేశ్వరం: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని బొమ్మూరు గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారిత అధికారి కేఎన్‌ జ్యోతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై గిరిజన జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థుల అభివృద్ధికి పలు పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ఇందిరా ప్రియదర్శిని, బాలికల సంక్షేమ అధికారిణి త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని