logo

లంకల్లో కలవరం

రెండోసారి గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో నదీ పరీవాహక లంక గ్రామాల ప్రజల వెన్నులో వణుకు మొదలైంది. ఇటీవల పలు గ్రామాలు వరద నీటిలో చిక్కుకుని విలవిల్లాడిన సంగతి తెలిసిందే. వరద బాధితులు తేరుకోకముందే మళ్లీ ఎగువన వర్షాలు కురుస్తుండడంతో ప్రవాహం పెరుగుతోంది.

Published : 10 Aug 2022 06:13 IST

వరదనీటిలో చాకలిపాలెం కాజ్‌వే

ఆత్రేయపురం: రెండోసారి గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో నదీ పరీవాహక లంక గ్రామాల ప్రజల వెన్నులో వణుకు మొదలైంది. ఇటీవల పలు గ్రామాలు వరద నీటిలో చిక్కుకుని విలవిల్లాడిన సంగతి తెలిసిందే. వరద బాధితులు తేరుకోకముందే మళ్లీ ఎగువన వర్షాలు కురుస్తుండడంతో ప్రవాహం పెరుగుతోంది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద మంగళవారం మధ్యాహ్నం నీటిమట్టం 9.5 అడుగులు ఉంది. సముద్రంలోకి ఆరు లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. ముందు జాగ్రత్త చర్యగా గ్రామస్థాయి అధికారులను అప్రమత్తం చేసినట్లు తహసీల్దారు ఎం.రామకృష్ణ, ఎంపీడీవో నాతి బుజ్జి తెలిపారు.

రాకపోకలకు ఇబ్బందులు..
పి.గన్నవరం: పి.గన్నవరం మండలం చాకలిపాలెం సమీపంలో కాజ్‌వే ముంపునకు గురైంది.ఈ సీజన్‌లో రెండోసారి ఈ కాజ్‌వే ముంపుబారినపడింది. జులైలో వచ్చిన వరద ఉద్ధృతికి సుమారు పక్షం రోజులుగా ముంపునీరే ఉంది. పడవలపై ప్రజలు రాకపోకలు సాగించారు. ఇక్కడ వశిష్ఠ గోదావరి అనుబంధ పాయ పోటెత్తి కాజ్‌వే మళ్లీ ముంపుబారిన పడింది. దీంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.

Read latest East godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts