logo

అరబిందో చొరవతో సెజ్‌ ప్రాంతంలో వసతులు: మంత్రి

అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ చొరవతో సెజ్‌ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మహర్దశ కలుగుతుందని ర.భ.శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. మండలంలోని తలపంటిపేటలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Published : 10 Aug 2022 06:13 IST

తొండంగి, న్యూస్‌టుడే: అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ చొరవతో సెజ్‌ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మహర్దశ కలుగుతుందని ర.భ.శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. మండలంలోని తలపంటిపేటలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొండంగి, ఉప్పాడ మండలాలకు చెందిన 750 మంది విద్యార్థినులకు మంత్రి రూ.38 లక్షల విలువ చేసే సైకిళ్లు పంపిణీ చేశారు. వీటితో పాటు 28 అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.15 లక్షల విలువ చేసే బీరువాలు, పిల్లల ఆట వస్తువులు, కుర్చీలు, ఇతర సామగ్రి అందజేశారు. ఫౌండేషన్‌ డైరెక్టర్లు కె.నిత్యానందరెడ్డి, శరత్‌చంద్రారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా సమీకృత వంటశాల నిర్మాణం జరుగుతుందని ఇది పూర్తయితే 5 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తారన్నారు. తుని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ కొయ్యా మురళి మాట్లాడుతూ.. ఏళ్ల తర్వాత స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అరబిందో ఫార్మా సీనియర్‌ అధికారి రామకృష్ణ, ఐసీడీఎస్‌ పీడీ ప్రవీణ, ఎంపీపీ అరుణ్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ నాగం గంగబాబు, యాదాల రాజబాబు అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని