logo

ఫార్మసీ రంగంలో మంచి భవిష్యత్తు

ఫార్మసీ రంగంలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని, ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని సాధన చేయాలని జేఎన్‌టీయూకే ఉపకులపతి ఆచార్య జీవీఆర్‌ ప్రసాదరాజు అన్నారు. శుక్రవారం వర్సిటీ ప్రాంగణంలో ఐఐఐపీటీ డైరెక్టరేట్‌

Published : 13 Aug 2022 03:41 IST

ప్రతిజ్ఞ చేస్తున్న వీసీ, అడిషనల్‌ ఎస్పీ, తదితరులు

వెంకట్‌నగర్‌, న్యూస్‌టుడే: ఫార్మసీ రంగంలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని, ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని సాధన చేయాలని జేఎన్‌టీయూకే ఉపకులపతి ఆచార్య జీవీఆర్‌ ప్రసాదరాజు అన్నారు. శుక్రవారం వర్సిటీ ప్రాంగణంలో ఐఐఐపీటీ డైరెక్టరేట్‌ ఆధ్వర్యంలో అనుబంధ కళాశాలల బీఫార్మసీ విద్యార్థులకు నియామక కార్యక్రమం నిర్వహించారు. అరబిందో ఫార్మా లిమిటెడ్‌ కంపెనీ పాల్గొని విద్యార్థులకు ముఖాముఖి నిర్వహించినట్లు డైరెక్టర్‌ ఆచార్య జి.యేసురత్నం తెలిపారు.  అంతకుముందు యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కాకినాడ  ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు జాతీయ జెండాలు పంపిణీ చేశారు.  

మాదక ద్రవ్యాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలు
మాదక ద్రవ్యాల వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని, వాటికి వ్యతిరేకంగా వ్యవహరించినప్పుడే సుస్థిరత నెలకొంటుందని జేఎన్‌టీయూకే ఉపకులపతి ఆచార్య జీవీఆర్‌ ప్రసాదరాజు అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా అలూమ్ని ఆడిటోరియంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ  చేశారు. అడిషనల్‌ ఎస్పీ పి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి సమాజాభివృద్ధికి కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య ఎల్‌.సుమలత, ప్రిన్సిపల్‌ ఆచార్య ఎం.హెచ్‌.ఎం.కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు