logo

వైభవంగా జయేంద్ర సరస్వతి జన్మతిథి మహోత్సవం

కంచి కామకోటి 69వ పీఠాధిపతి శ్రీజయేంద్ర సరస్వతి స్వామివారి జన్మతిథి మహోత్సవాలను కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామీజీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.

Published : 13 Aug 2022 03:41 IST

కాకినాడ ప్రజా విద్యాలయానికి రూ.లక్ష చెక్కు చేస్తున్న చాగంటి

సర్పవరం జంక్షన్‌, గాంధీనగర్‌: కంచి కామకోటి 69వ పీఠాధిపతి శ్రీజయేంద్ర సరస్వతి స్వామివారి జన్మతిథి మహోత్సవాలను కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామీజీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. కాకినాడలోని తిమ్మాపురం ఆకొండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో కంచి పీఠాధిపతి చాతుర్మాస దీక్ష శుక్రవారానికి 31వ రోజుకు చేరింది.  స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీమహాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వరుడి యోగలింగానికి నిత్య త్రికాల పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. కంచి పీఠాధిపతి ఆధ్వర్యంలో జయేంద్ర సరస్వతి చిత్రపటం వద్ద ప్రత్యక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు, ఆశీసులు అందజేశారు. కంచి పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా పేదలకు కుట్టుమిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, ఇడ్లీ పాత్రలు, దివ్యాంగులకు చక్రాల కుర్చీలు, వినికిడి యంత్రాలను అందజేశారు. కాకినాడ ఎస్‌.అచ్యుతాపురంలోని ఉచిత పాఠశాల ప్రజా విద్యాలయానికి పీఠం తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి,. ప్రభాకరశర్మ, బాలకృష్ణ శాస్త్రి తదితరులు శ్రీవిజయేంద్ర సరస్వతితో ఉన్న సాన్నిహిత్యం, ఆయన ధర్మప్రచారం, సామజిక సేవలను కొనియాడారు. సాయంత్రం చాతుర్మాస గురుప్రియ సంగీత ఉపాసన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విశాఖకు చెందిన శ్రీధృతి ఆలపించిన అన్నమయ్య కీర్తనలు అలరించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు