logo

తెలంగాణ ఎంసెట్‌లో తిరుమల విద్యార్థుల ప్రతిభ

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో రాజమహేంద్రవరం తిరుమల ఐఐటీ అండ్‌ మెడికల్‌ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల

Published : 13 Aug 2022 03:41 IST

దానవాయిపేట(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో రాజమహేంద్రవరం తిరుమల ఐఐటీ అండ్‌ మెడికల్‌ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల ఛైర్మన్‌ నున్న తిరుమలరావు తెలిపారు. అగ్రికల్చరల్‌, ఫార్మసీ విభాగంలో వి.రోహిత్‌ రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు, ఎస్‌ఎస్‌ శ్యామసుందర్‌ 32, బీఎన్‌వీబీఎస్‌ నారాయణ 35, వీఏ లక్ష్మి 37, ఎస్‌ఎస్‌ కుమార్‌ 54, సీహెచ్‌వీ చక్రవర్తి 71, ఎస్‌హెచ్‌వీఎస్‌ఎల్‌ శ్రీవళ్లి 104, కె.హృత్విక్‌ 112, ఎఎస్‌ఎల్‌డీ సంతోషిణి 144, సీహెచ్‌ శుభ 151, పీఎస్‌ఎల్‌ఎన్‌ బాలేశ్వరి 152, కేవీ వినూత్న 155, డీఎస్‌ శరణ్య 183 ర్యాంకులను సాధించారన్నారు. ప్రతిభచాటిన విద్యార్థులను అకడమిక్‌ డైరెక్టర్‌ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపల్‌ వి.శ్రీహరి తదితరులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని