logo

మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం

కాకినాడ జిల్లాలో ఎస్‌ఈబీ, పోలీస్‌ అధికారులు సమన్వయంతో అక్రమంగా సారా తయారీ, మద్యం అక్రమ అమ్మకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు పేర్కొన్నారు. కాకినాడ గ్రామీణం నేమాం గ్రామ శివార్లలో

Published : 17 Aug 2022 06:14 IST

మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో తొక్కిస్తున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

సర్పవరం జంక్షన్‌: కాకినాడ జిల్లాలో ఎస్‌ఈబీ, పోలీస్‌ అధికారులు సమన్వయంతో అక్రమంగా సారా తయారీ, మద్యం అక్రమ అమ్మకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు పేర్కొన్నారు. కాకినాడ గ్రామీణం నేమాం గ్రామ శివార్లలో మంగళవారం ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు పి.శ్రీనివాస్‌, జయరాజుతో కలిసి స్వాధీనం చేసుకున్న నాటుసారా, మద్యం సీసాలను ధ్వంసం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో నమోదైన 2,332 కేసుల్లో రూ.1.20 కోట్ల విలువైన 5.98,436 లీటర్ల నాటు సారా, 275 కేసుల్లో రూ.6 లక్షల విలువైన 3,443 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. గతంలో తొమ్మిది మందిపై పీడీ యాక్డు పెట్టామని, వారు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. మున్ముందు అలాంటి వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సారా తయారీ, విక్రేతలకు అవసరమైతే నగర, జిల్లా బహిష్కరణ చేస్తామన్నారు. స్వాధీనం చేసుకున్న నాటుసారాను పొక్లెయిన్‌తో పెద్ద గొయ్యి తీసి పారబోశారు. మద్యం సీసాలను తీరంలోని రహదారిపై పేర్చి, రోడ్డు రోలర్‌ను ఎస్పీ స్వయంగా నడిపి ధ్వంసం చేశారు. గ్రామ సర్పంచి రాందేవు చిన్న, ఎస్‌ఈబీ, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని