logo

ధాన్యం డబ్బులు చెల్లించరూ..

రబీ సీజన్‌లో రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి వెంటనే డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. కొన్నేళ్లుగా ఖరీఫ్‌ పంట చేతికొచ్చే సయయంలో ముంపు బారినపడి రైతులకు నష్టాలే మిగులుతున్నాయని, దాంతో కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంటోందని వారు వాపోయారు.

Published : 17 Aug 2022 06:14 IST

తహసీల్దార్‌ ప్రసాద్‌కు వినతిపత్రం అందిస్తున్న రైతులు

అల్లవరం: రబీ సీజన్‌లో రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి వెంటనే డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. కొన్నేళ్లుగా ఖరీఫ్‌ పంట చేతికొచ్చే సయయంలో ముంపు బారినపడి రైతులకు నష్టాలే మిగులుతున్నాయని, దాంతో కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంటోందని వారు వాపోయారు. దీనికితోడు ప్రభుత్వ రబీ ధాన్యం సొమ్ము మూడు నెలలైనా ఇప్పటికీ చెల్లించకపోవడంతో పెట్టుబడికి అప్పులుతెచ్చినచోట వడ్డీలు పెరిగి రైతులపై మరింత భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగునీరు సక్రమంగా దిగేలా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని, డ్రెయిన్ల ఆక్రమణలు తొలగించి ఆధునికీకరణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ ఎన్‌.ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. యాళ్ల బ్రహ్మానందం, పొలాశెట్టి భాస్కరరావు, అకుల లక్ష్మణరావు, కుడిపూడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని