logo

దేవీచౌక్‌లో అమ్మవారి ఉత్సవమూర్తి ప్రతిష్ఠాపన నేడు

దసరా ఉత్సవాలకు గోదావరి తీరంలోని ప్రధాన కేంద్రం దేవీచౌక్‌ను భారీ సెట్టింగులతో ముస్తాబు చేశారు. చౌక్‌ను ఆనుకుని అయిదు మార్గాల్లో పందిళ్లు వేసి విద్యుద్దీపాలతో అలంకరించారు. అమ్మవారి ఉత్సవమూర్తి ప్రతిష్ఠాపనకు

Published : 25 Sep 2022 03:11 IST

ఉత్సవాలకు ముస్తాబవుతున్న వేదిక

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: దసరా ఉత్సవాలకు గోదావరి తీరంలోని ప్రధాన కేంద్రం దేవీచౌక్‌ను భారీ సెట్టింగులతో ముస్తాబు చేశారు. చౌక్‌ను ఆనుకుని అయిదు మార్గాల్లో పందిళ్లు వేసి విద్యుద్దీపాలతో అలంకరించారు. అమ్మవారి ఉత్సవమూర్తి ప్రతిష్ఠాపనకు దేవీచౌక్‌ ఎదురుగా ప్రత్యేకంగా వేదికను రూపొందించారు. శ్రీదేవి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి శ్రీదేవి కల్యాణ మండపం నుంచి సమితి సభ్యులు అమ్మవారి ఉత్సవమూర్తిని మేళతాళాలతో ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొస్తారు. ఆలయ ప్రధానార్చకుడు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అమ్మవారిని ప్రతిష్ఠాపన చేసి హారతి అందిస్తారు. అమ్మవారి ప్రతిష్ఠాపన అనంతరం దేవీచౌక్‌లో విద్యుద్దీపాలను ప్రారంభిస్తారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని