logo

మహిళలు విద్యావంతులైతేనే సమాజాభివృద్ధి

మహిళలు విద్యావంతులైనప్పుడే సమాజాభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. జ్యోతిబాఫులె ‘సత్యశోధక్‌ సమాజ్‌’ 150వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్‌

Published : 25 Sep 2022 03:11 IST

మాట్లాడుతున్న మండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజు. వేదికపై వాసిరెడ్డి పద్మ, జక్కంపూడి

విజయలక్ష్మి, ఎంపీ భరత్‌రామ్‌, రుడా ఛైర్‌పర్సన్‌ షర్మిలారెడ్డి

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: మహిళలు విద్యావంతులైనప్పుడే సమాజాభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. జ్యోతిబాఫులె ‘సత్యశోధక్‌ సమాజ్‌’ 150వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో శనివారం రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తొలుత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌, జ్యోతిబాఫులె, సావిత్రిబాయిఫులె చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అధ్యక్షతన జరిగిన సదస్సులో మోషేన్‌రాజు మాట్లాడుతూ సమాజంలో అంటరానితనాన్ని పోగొట్టడానికి, మహిళల హక్కుల కోసం అంబేడ్కర్‌ కృషి చేస్తే, సమాజంలో మహిళలు విద్యావంతులు కావడానికి కృషి చేసిన వ్యక్తి జ్యోతిబాఫులె అన్నారు. మహిళలు తమ హక్కుల కోసం పోరాటాలు చేసే పరిస్థితి నేటికీ ఉండటం దురదృష్టకరమన్నారు. అంబేడ్కర్‌, ఫులె వంటి మహనీయుల ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మరో అతిథి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ భరత్‌రామ్‌ మాట్లాడుతూ జ్యోతిబాఫులె గొప్ప సంఘ సంస్కర్తని, ఆయన ఏర్పాటు చేసిన సత్యశోధక్‌ సమాజ్‌ గురించి ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. శ్రీకాకుళం ఎస్పీ రాధిక మాట్లాడుతూ సమాజంలో ఎటువంటి నేరాలు జరిగినా స్పందించే సామాజిక స్పృహ ప్రతిఒక్కరిలో ఉండాలన్నారు. రుడా ఛైర్‌పర్సన్‌ షర్మిలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి విజయలక్ష్మి, మహిళా కమిషన్‌ సభ్యులు, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని