logo

ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలని జడ్పీ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు పేర్కొన్నారు. కాకినాడలోని జడ్పీ కార్యాలయంలో శనివారం జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘాల (స్టాండింగ్‌ కమిటీ) సమావేశం నిర్వహించారు.

Published : 25 Sep 2022 03:11 IST

సభ్యులకు జ్ఞాపికలు అందజేస్తున్న జడ్పీ ఛైర్మన్‌ వేణుగోపాలరావు

కాకినాడ నగరం: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలని జడ్పీ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు పేర్కొన్నారు. కాకినాడలోని జడ్పీ కార్యాలయంలో శనివారం జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘాల (స్టాండింగ్‌ కమిటీ) సమావేశం నిర్వహించారు. ఆయా స్థాయీ సంఘాల ఛైర్మన్లతో పాటు జడ్పీ వైస్‌ ఛైర్మన్లు బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ ప్రజల చెంతకే పాలన తెచ్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.  అనంతరం జడ్పీ కార్యవర్గం కొలువుదీరి ఏడాది పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవం నిర్వహించారు. సీనరేజీ నిధులను సమకూర్చుకుని సభ్యులకు పరిస్థితిని బట్టి మంజూరు చేశామని జడ్పీ ఛైర్మన్‌ గుర్తుచేశారు.  తరువాత జడ్పీటీసీ సభ్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో సత్యనారాయణ,   జిల్లా వ్యవసాయ శాఖాధికారి  విజయ్‌కుమార్‌, పశుసంవర్థక శాఖ జేడీ సూర్యప్రకాశరావు, బీసీ కార్పొరేషన్‌ ఈడీ సుబ్బలక్ష్మి, గృహనిర్మాణ శాఖ పీడీ సుదర్శన్‌పట్నాయక్‌,  తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని