logo

గాంధీజీ జీవితం యువతకు ఆదర్శనీయం

ఆధునిక సమాజంలో మహాత్ముని జీవితమే ఒక పాఠ్యాంశమని, నేటి యువత చదువుతో పాటు ఆయన గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని బెర్లిన్‌లోని గాంధీ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ అధ్యక్షుడు డా. క్రిస్టియన్‌ బార్‌ టోల్ప్‌ పేర్కొన్నారు.

Published : 25 Sep 2022 03:11 IST

బార్‌ టోల్ఫ్‌ను సత్కరిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణ

రాజానగరం: ఆధునిక సమాజంలో మహాత్ముని జీవితమే ఒక పాఠ్యాంశమని, నేటి యువత చదువుతో పాటు ఆయన గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని బెర్లిన్‌లోని గాంధీ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ అధ్యక్షుడు డా. క్రిస్టియన్‌ బార్‌ టోల్ప్‌ పేర్కొన్నారు.  జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాల విద్యార్థులో శనివారం ఆయన ముఖాముఖి మాట్లాడారు. మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గాంధీజీ కలలను సాకారం చేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టి సుపరిపాలన అందిస్తోందన్నారు. సర్వోదయ సంస్థ ప్రతినిధి ప్రసాద్‌ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని గాంధీజీ స్వయంగా ఆచరించి ఒక ఆహార విధానాన్ని రూపొందించారన్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ అహింసే  ఆయుధమని ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్మాగాంధీ ఆశయాన్ని విద్యార్థులు స్పూర్తిగా తీసుకోవాలన్నారు. వైద్య కళాశాల ఛైర్మన్‌ డా.గన్ని భాస్కరరావు, డా.వైవి శర్మ, ప్రిన్సిపల్‌ డా.వి.గురునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని