logo

అభివృద్ధికి కార్పొరేట్‌ సంస్థలు సహకరించాలి

జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కార్పొరేట్‌ సంస్థలు సీఎస్‌ఆర్‌ నిధులు పెద్దఎత్తున ఇవ్వాలని కలెక్టర్‌ కృతికాశుక్లా కోరారు. శనివారం కలెక్టరేట్‌లో జేసీ ఇలక్కియతో కలిసి వివిధ కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులతో సీఎస్‌ఆర్‌ నిధులపై

Published : 25 Sep 2022 03:11 IST

సమీక్షిస్తున్న కలెక్టర్‌ కృతికాశుక్లా, పక్కన జేసీ ఇలక్కియ

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కార్పొరేట్‌ సంస్థలు సీఎస్‌ఆర్‌ నిధులు పెద్దఎత్తున ఇవ్వాలని కలెక్టర్‌ కృతికాశుక్లా కోరారు. శనివారం కలెక్టరేట్‌లో జేసీ ఇలక్కియతో కలిసి వివిధ కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులతో సీఎస్‌ఆర్‌ నిధులపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో చమురు, ఎరువుల తయారీ, పోర్టులు తదితర సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని, వీటికి సంబంధించి సీఎస్‌ఆర్‌ నిధులు క్రమం తప్పకుండా ఇవ్వాలన్నారు. గిరిజన, సబ్‌ప్లాన్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. విద్య, వైద్యానికి ఈ నిధులు వెచ్చించామని, జిల్లాలో అంతర్జాతీయ, జాతీయ స్థాయి క్రీడాకారులున్నారని, వీరికి ప్రోత్సాహం అందించాలన్నారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలకు ఈ నిధులివ్వాలన్నారు. సమావేశంలో సీపీవో త్రినాథ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

* పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. శనివారం జేసీ ఇలక్కియ, రెవెన్యూ, పురపాలక అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులకు జగనన్న కాలనీల్లో ఖాళీ ప్లాట్లను కేటాయించాలన్నారు. ఇంకా అవసరమైన లే-ఔట్లకు భూసేకరణ చేపట్టాలని సూచించారు.

* జిల్లాలో డిగ్రీ చదువుతున్న 11,622 మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమం కింద నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రైవేటు సంస్థలతో విద్యార్థుల మ్యాపింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలో 54 కళాశాలల ప్రతినిధులు హాజరై మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని