logo

దివ్యదర్శనం.. భక్తపావనం

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు శ్రీమన్నారాయణుడు దివ్యాలంకార శోభితులై భక్తులకు జగన్మోహనంగా దర్శనమిచ్చారు. వేంకటేశ్వరుడు కొలువు దీరిన కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది.

Published : 25 Sep 2022 03:11 IST

విశేషాలంకరణలో వేంకటేశ్వరుడు

వాడపల్లి(ఆత్రేయపురం): అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు శ్రీమన్నారాయణుడు దివ్యాలంకార శోభితులై భక్తులకు జగన్మోహనంగా దర్శనమిచ్చారు. వేంకటేశ్వరుడు కొలువు దీరిన కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఏడు ప్రదక్షిణలతో స్వామివారిని దర్శించుకున్నారు. వేకువ జామున 3 గంటలకు సుప్రభాత సేవ నుంచి రాత్రి పవళింపు సేవ వరకు సుమారు 48వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. వారిలో 15వేల మంది అన్నప్రసాదం స్వీకరించారు. దర్శన టిక్కెట్లు తదితరాల ద్వారా దాదాపు రూ.18 లక్షల ఆదాయం వచ్చింది. కాకినాడ, తణుకు, రాజమహేంద్రవరం, గోకవరం, ఏలేశ్వరం, అమలాపురం, రామచంద్రపురం, రావులపాలెం డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపారు. దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఏర్పాట్లు పర్యవేక్షించారు.


కిక్కిరిసిన భక్తజనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు