logo

రుణాల మంజూరుకు బ్యాంకర్లు సహకరించాలి

జగగన్న తోడు, టిడ్కో గృహ లబ్ధిదారులకు రుణాల మంజూరులో బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా కోరారు. శనివారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో జిల్లావ్యాప్తంగా ఉన్న బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.

Published : 25 Sep 2022 03:11 IST

సమీక్షిస్తున్న కలెక్టర్‌, పక్కనే అధికారులు

అమలాపురం(అల్లవరం): జగగన్న తోడు, టిడ్కో గృహ లబ్ధిదారులకు రుణాల మంజూరులో బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా కోరారు. శనివారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో జిల్లావ్యాప్తంగా ఉన్న బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయితీ రుణాలు, గృహ రుణాలపై సమీక్ష నిర్వహించారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా అందిస్తున్న రాయితీ యూనిట్లు ఏర్పర్చుకుని లబ్ధిదారులు వాటి ద్వారా వచ్చే ఆదాయంతో సకాలంలో రుణాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. టిడ్కో లబ్ధిదారులకు గృహ రుణాల మంజూరు పూర్తిచేసి, తిరస్కరణకుగురైన దరఖాస్తులను పునఃపరిశీలించాలన్నారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read latest East godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని